యాప్నగరం

మయాంక్‌పై ఆ చిన్నచూపేలా..? : జహీర్

మయాంక్ అగర్వాల్‌‌కి టెస్టు జట్టులో చోటివ్వకపోవడం నాకు సమంజసంగా అనిపించలేదు. ఫామ్‌లో ఉన్న ఆటగాడు కనీసం జట్టులో ఉండాలి. ఇక తుది జట్టులోకి తీసుకుంటారా..? లేదా..? అనేది రెండో విషయం.

Samayam Telugu 28 Oct 2018, 6:25 pm
భారత యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌‌కి అవకాశాలివ్వడంలో సెలక్టర్లు అలక్ష్యం వహిస్తున్నారని మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్టు జట్టులో సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్‌కి పునరాగమనం ఛాన్స్ ఇచ్చిన సెలక్టర్లు.. అగర్వాల్‌ని పట్టించుకోలేదు. గత ఏడాదికాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత రికార్డులు నమోదు చేసిన యువ ఓపెనర్‌పై సెలక్టర్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని జహీర్ నిరాశ వ్యక్తం చేశాడు.
Samayam Telugu Team-India-SL-test-1


‘మయాంక్ అగర్వాల్‌‌కి టెస్టు జట్టులో చోటివ్వకపోవడం నాకు సమంజసంగా అనిపించలేదు. ఫామ్‌లో ఉన్న ఆటగాడు కనీసం జట్టులో ఉండాలి. ఇక తుది జట్టులోకి తీసుకుంటారా..? లేదా..? అనేది రెండో విషయం. అలాకాకుండా.. అసలు జట్టులోకే ఎంపిక చేయకపోతే.. ఇక ప్రతిభని నిరూపించుకునే అవకాశమేది..? వెస్టిండీస్‌తో రెండు టెస్టులకి ఎంపికైన మయాంక్ అగర్వాల్.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కి ఎంపిక కాకపోవడంతో.. ఇప్పుడు అతను ‘‘నేను మైదానంలోని ఆటగాళ్లకి సరిగా డ్రింక్స్‌ని అందించలేదా..?’’ అని మదనపడుతుంటాడు’ అని జహీర్ వ్యంగ్యంగా వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.