యాప్నగరం

భారత్ x ఆస్ట్రేలియా సిరీస్‌కి పాత రూల్స్..!

క్రికెటర్లలో క్రమశిక్షణ, ఆటలో నాణ్యత పెంచేందుకు ఐసీసీ క్రికెట్‌లోకి కొత్త రూల్స్‌ని ఈ నెలలోనే ప్రవేశపెట్టనుంది.

TNN 7 Sep 2017, 2:04 pm
క్రికెటర్లలో క్రమశిక్షణ, ఆటలో నాణ్యత పెంచేందుకు ఐసీసీ క్రికెట్‌లోకి కొత్త రూల్స్‌ని ఈ నెలలోనే ప్రవేశపెట్టనుంది. అయితే.. సెప్టెంబరు 17 నుంచి జరగనున్న భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఈ రూల్స్‌ నుంచి మినహాయింపు లభించింది. మైదానంలో దురుసుగా ప్రవర్తించిన క్రికెటర్‌‌పై తక్షణమే అంపైర్లు చర్యలు తీసుకోవడం, బ్యాట్ పరిమాణం‌లో ఆంక్షలు, డీఆర్‌ఎస్‌లో మార్పులు తదితర రూల్స్ ఇందులో ఉన్నాయి. సెప్టెంబరు 28 నుంచి ఈ రూల్స్‌ అమలులోకి రానున్నట్లు ఐసీసీ ప్రకటించగా.. అక్టోబరు 13 వరకు జరగనున్న భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఇవి వర్తించవని తాజాగా వెల్లడించింది.
Samayam Telugu india vs australia series to be played as per old icc rules
భారత్ x ఆస్ట్రేలియా సిరీస్‌కి పాత రూల్స్..!


‘సెప్టెంబరు 28 నుంచి జరగనున్న శ్రీలంక- పాకిస్థాన్, బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లకి ఐసీసీ కొత్త రూల్స్ వర్తిస్తాయి. కానీ.. ఈ నెల మధ్యలోనే ఆరంభమయ్యే భారత్- ఆస్ట్రేలియా సిరీస్‌కి మాత్రం ఇవి వర్తించవు. ఈ సిరీస్ అక్టోబరు మధ్య వరకు కొనసాగినా.. ఒకే సిరీస్‌లో రెండు రూల్స్ ఉండకూడదనే ఉద్దేశంతో మినహాయింపు ఇస్తున్నాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త రూల్స్‌లో డీఆర్‌ఎస్‌ని ‘అంపైర్ కాల్‌’‌గా పేరు మారుస్తున్నారు. ఆటగాళ్లు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే.. ఫుట్‌బాల్ ఆటగాళ్ల తరహాలో అంపైర్లు క్రికెటర్లని మైదానం నుంచి వెలుపలికి పంపించేయచ్చు. క్రీజులోకి బ్యాట్స్‌మెన్ ఒకసారి వచ్చి.. బెయిల్ పడుతున్న సమయంలో బ్యాట్ లేదా పాదం గాల్లో ఉన్నా ఇకపై ఔట్ కాదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.