యాప్నగరం

గ్యాప్ వచ్చింది.. తప్పు ఒప్పుకున్న ఉమేశ్

చాలా రోజుల తర్వాత వన్డే మ్యాచ్‌లు ఆడటంతోనే గత గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో

TNN 30 Sep 2017, 5:27 pm
చాలా రోజుల తర్వాత వన్డే మ్యాచ్‌లు ఆడటంతోనే గత గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్నట్లు భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అంగీకరించాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం ఐదో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో ఉమేశ్ మాట్లాడాడు. తొలి మూడు వన్డేలు ఆడిన పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకి నాలుగో వన్డేలో విశ్రాంతినిచ్చిన భారత మేనేజ్‌మెంట్ వారి స్థానంలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలను తుది జట్టులోకి తీసుకుంది. అయితే.. మ్యాచ్‌లో ఉమేశ్ తన కోటా 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. అతను నాలుగు వికెట్లు తీసినా.. అప్పటికే ఆస్ట్రేలియా భారీ స్కోరు‌కి బాటలు వేసుకుంది.
Samayam Telugu india vs australia shami and i must take more responsibility in odis says umesh yadav
గ్యాప్ వచ్చింది.. తప్పు ఒప్పుకున్న ఉమేశ్


‘బెంగళూరు వన్డేలో అనూహ్యంగా భారత్ ఓడినా.. అది జట్టుపై ఏమంత ప్రభావం చూపలేదు. మేము అదనంగా 15-20 పరుగులు ఎక్కువ ఇచ్చాం. మహ్మద్ షమీ, నేను చాలా రోజుల తర్వాత వన్డే మ్యాచ్‌ ఆడాం. అందుకే తొందరగా లయ అందుకోలేకపోయాం. కానీ.. మేము సీనియర్ బౌలర్లు కాబట్టి.. జట్టు అవసరానికి తగినట్లు బౌలింగ్ చేయాల్సి ఉండేది. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగే ఐదో వన్డేలో తప్పకుండా నేను, షమీ ఎక్కువ బాధ్యత తీసుకుని బౌలింగ్ చేస్తాం’ అని ఉమేశ్ యాదవ్ వివరించాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో రెగ్యులర్ బౌలర్‌గా ఉన్న ఉమేశ్ యాదవ్‌ని వన్డే, టీ20ల్లో మాత్రం భారత మేనేజ్‌మెంట్ దూరంగా పెడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.