యాప్నగరం

కోహ్లిని ట్రంప్‌తో పోల్చిన ఆసీస్ మీడియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆటతో సమాన స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. బెంగళూరు టెస్టులో స్మిత్ డీఆర్ఎస్ వివాదంతో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరగా.

TNN 21 Mar 2017, 4:42 pm
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆటతో సమాన స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. బెంగళూరు టెస్టులో స్మిత్ డీఆర్ఎస్ వివాదంతో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరగా.. తర్వాత కూడా ఇదే తీరు కొనసాగుతోంది. ముఖ్యంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లినే లక్ష్యంగా ఆసీస్ ఆటగాళ్లతోపాటు ఆ దేశ మీడియా కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇయాన్ హేలీ, మిచెల్ జాన్సన్ లాంటి ఆటగాళ్లు కోహ్లిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత ఆసీస్ మీడియా మరోసారి కోహ్లిని టార్గెట్ చేసింది. డెయిలీ టెలీగ్రాఫ్ అయితే కోహ్లిని ట్రంప్‌తో పోల్చడానికి కూడా వెనుకాడలేదు.
Samayam Telugu india vs australia virat kohli has become trump of world sport
కోహ్లిని ట్రంప్‌తో పోల్చిన ఆసీస్ మీడియా


‘ప్రపంచ క్రీడారంగంలో విరాట్ కోహ్లి ట్రంప్‌లా తయారయ్యాడు. అమెరికా అధ్యక్షుడిలాగే భారత కెప్టెన్ కూడా మీడియాపై నిందలు మోపుతున్నాడు’ అని డెయిలీ టెలీగ్రాఫ్ తన ఆర్టికల్‌లో రాసుకొచ్చింది. బెంగళూరు టెస్టులో స్మిత్ డీఆర్ఎస్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా మీడియా కోహ్లిని జంతువులతో పోల్చిన సంగతి తెలిసిందే.

మూడో టెస్టుకు ముందు ఆటపై దృష్టి సారిస్తామని ఇరు జట్ల ఆటగాళ్లు చెప్పినప్పటికీ.. రాంచీ టెస్టులో కోహ్లి భుజానికి గాయం కావడంతో మరోసారి ఆసీస్ ఆటగాళ్లు తమ బుద్ధి బయటపెట్టుకున్నారు. విరాట్‌ను అనుకరిస్తూ.. హేళన చేశారు. తమ జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ను ఆస్ట్రేలియన్లు అవమానించారని కోహ్లి ఆరోపించగా, ఈ విమర్శలను స్మిత్ కొట్టిపారేశాడు. ప్యాట్రిక్ మంచి ఫిజియో అంటూ అతడిపై ప్రశంసలు గుప్పించాడు. కోహ్లిని ట్రంప్‌తో పోల్చిన ఆసీస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.