యాప్నగరం

Team India: ప్రాకీస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన కోహ్లి, రాహుల్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్లు రెండు జట్లుగా విడిపోయి 40 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. రాహుల్ నాయకత్వంలోని రంజింగ్ సింగ్ జట్టుపై కోహ్లి సారథ్యంలోని సీకే నాయుడు జట్టు విజయం సాధించింది.

Samayam Telugu 23 Nov 2020, 8:09 am
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్లు రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. సిడ్నీ వేదికగా నిర్వహించిన 40 ఓవర్ల మ్యాచ్‌లో... కోహ్లి నాయకత్వంలోని సీకే నాయుడు జట్టు.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని రంజిత్ సింగ్ జీ ఎలెవన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది.
Samayam Telugu practice match
Image: Instagram/BCCI


చిరు జల్లుల కారణంగా ఈ మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాహుల్ జట్టు తరఫున శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలో దిగారు. రాహుల్ 66 బంతుల్లో 83 రన్స్ చేయగా.. రంజిత్ సింగ్ జట్టు 235 రన్స్ చేసింది.

బదులుగా కోహ్లి సేన 26 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీకే నాయుడు జట్టు తరఫున శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా ఓపెనర్లుగా ఆడారు. కెప్టెన్ విరాట్ కోహ్లి 58 బంతుల్లోనే 91 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడని బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని బట్టి అర్థమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.