యాప్నగరం

India Tour of Australia: పాపం పంత్‌.. ఈ కారణంతోనే పక్కనబెట్టిన సెలక్టర్లు!

ఆస్ట్రేలియా పర్యటన కోసం మూడు ఫార్మాట్లకూ జట్లను ఓకేసారి ఎంపిక చేసిన సెలక్టర్లు రిషబ్ పంత్‌ను పక్కనబెట్టారు. అధిక బరువు కారణంగానే పంత్‌ను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 27 Oct 2020, 8:39 am
ధోనీ వారసుడిగా అందరూ భావిస్తోన్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు పంత్‌ను పక్కనబెట్టింది. టెస్టు జట్టులోకి పంత్‌‌ను తీసుకున్నప్పటికీ.. బ్యాకప్ వికెట్ కీపర్‌గానే అతణ్ని ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ధోనీ తర్వాత తానే అని భావిస్తోన్న పంత్‌‌ను ఆస్ట్రేలియా పర్యటనకు పక్కనబెట్టడం ద్వారా బీసీసీఐ గట్టి సంకేతాలను పంపిందింది.
Samayam Telugu ​Rishabh Pant
Rishabh Pant. (BCCI/IPL/PTI Photo)


పంత్‌ను పక్కనబెట్టడానికి కారణం అధిక బరువు, ఫిట్‌నెస్ లేకపోవడమేనని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు జట్లను బీసీసీఐ ప్రకటించడానికి ముందే.. పంత్‌కు చోటు దక్కదనే వార్తలు బయటికొచ్చాయి. టీమిండియా ఫిట్‌నెస్ ట్రైనర్ పంత్‌తో భేటీ అయ్యారని... ఈ సందర్భంగా అతడు అధిక బరువు ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ కారణంతోనే సెలక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు యువ వికెట్ కీపర్‌ను ఎంపిక చేయలేదని సమాచారం.

పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్ బ్యాటింగ్‌తోపాటు వికెట్ కీపింగ్ చేయగలడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తోన్న రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించిన బీసీసీఐ.. అతణ్నే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. టెస్టుల్లో సాహాకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన బీసీసీఐ.. బ్యాకప్ వికెట్ కీపర్‌గా పంత్‌ను ఎంపిక చేసింది. అదే సమయంలో రాహుల్‌కు సైతం టెస్టు జట్టులో చోటు దక్కడం గమనార్హం. పంత్‌కు ఆస్ట్రేలియా పర్యటనలో చోటు దక్కకపోవడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.