యాప్నగరం

కొనసాగిన భారత్‌ హవా.. బంగ్లా డీలా

హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండో రోజూ శతకాల మోత మోగించింది.

TNN 10 Feb 2017, 5:36 pm
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండో రోజూ శతకాల మోత మోగించింది. 687 పరుగుల భారీ స్కోరుతో పర్యాటక జట్టుకు సవాల్ విసిరింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (204) డబుల్ సెంచరీతో బౌలర్లను ఓ ఆటాడుకోగా.. వృద్ధిమాన్ సాహా (106) సమయోచిత శతకంతో పునరాగమనమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు 356/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. రెండో రోజు మరో గంట ఆట మిగిలి ఉందనగా 687/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ సౌమ్య సర్కార్ (15) వికెట్ కోల్పోయి 41 పరుగులు చేయగలిగింది. క్రీజులో తమీమ్ ఇక్బాల్ (24), మెమినల్ హక్ (1) ఉన్నారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 646 పరుగులు వెనుకబడి ఉంది.
Samayam Telugu india vs bangaldesh kohli gang played well on second day also
కొనసాగిన భారత్‌ హవా.. బంగ్లా డీలా


ఉదయం నుంచే భారత్‌దే హవా..!

తొలి రోజు శతకం సాధించిన కోహ్లి.. రెండో రోజు వన్డే తరహా ఆటతో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వరుస బౌండరీలు బాదుతూ 239 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పేలవ షాట్ ఆడిన పెవిలియన్ చేరిన రహానె (82) సెంచరీ మిస్సయ్యాడు. మరో ఎండ్‌లో మాత్రం కోహ్లి లయ తప్పకుండా వరుసగా నాలుగో టెస్టు సిరీస్‌లోనూ ద్విశతకం బాది అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే డబుల్ సెంచరీ అనంతరం బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లి ఎల్బీడబ్ల్యూగా ఔటవగా.. అనంతరం వచ్చిన అశ్విన్ (34) ఫర్వాలేదనిపించాడు.

ఈ దశలో వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్), ఆల్‌రౌండర్ జడేజా (60 నాటౌట్)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 118 పరుగులు జత చేయడంతో భారత్ 687 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. గత మూడు టెస్టు మ్యాచ్‌ల్లోనూ భారత్ 600కు పైగా పరుగులు చేయడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో మరే జట్టు కూడా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 600+ రన్స్ సాధించలేకపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.