యాప్నగరం

డీఆర్‌ఎస్‌పై పంత్‌‌ని నమ్మక తప్పలేదు: రోహిత్

మహేంద్రసింగ్ ధోనీ టీమ్‌కి దూరమైనప్పటి నుంచి టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ డీఆర్‌ఎస్ కోరడంలో ఘోరంగా విఫలమవుతోంది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లోనూ ఆ ఫెయిల్యూర్ కొనసాగింది.

Samayam Telugu 4 Nov 2019, 12:15 pm
బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు ఓటమికి పరోక్షంగా డీఆర్‌ఎస్‌ కోరకపోవడం కూడా ఓ కారణమైంది. అప్పుడప్పుడే క్రీజులో కుదురుకుంటున్న ముష్ఫికర్ రహీమ్.. వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్దే వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కానీ.. భారత్ ఔట్ అప్పీల్‌ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించగా.. రిషబ్ పంత్‌ స్పష్టమైన అభిప్రాయం చెప్పకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కోరే సాహసం చేయలేదు.
Samayam Telugu Rohit Sharma, Rishabh Pant


Read More: IND vs BAN 1st 20‌లో టర్నింగ్ పాయింట్ ఇదే..!

జీవనదానం పొందిన ముష్ఫికర్ రహీమ్ ( 60 నాటౌట్: 43 బంతుల్లో 8x4, 1x6) ఆఖరి వరకూ క్రీజులో నిలిచి బంగ్లాదేశ్‌ని గెలిపించాడు. ఆ ఓవర్‌లోనే సౌమ్య సర్కార్‌ కీపర్ క్యాచ్ ఔటని కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కోరేలా పంత్ చేశాడు. కానీ.. బంతి బ్యాట్‌కి చాలా దూరంగా వెళ్తోందని రిప్లైలో కనిపించింది. మొత్తంగా.. మ్యాచ్‌లో కీపర్‌గా రిషబ్ పంత్ డీఆర్‌ఎస్‌ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు.

Rishabh Pant Trolls: ధోనీ నువ్వు వచ్చేయ్.. రిషబ్ పంత్‌ని ఉతికారేస్తున్న నెటిజన్లు

రిషబ్ పంత్ డీఆర్‌ఎస్ తప్పిదాల గురించి తాజాగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘రిషబ్ పంత్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అతను డీఆర్‌ఎస్‌పై కచ్చితమైన అభిప్రాయాలు చెప్పాలంటే కొంత సమయం పడుతుంది. బంతిని కరెక్ట్ పొజిషన్ నుంచి కెప్టెన్‌కి చూసే అవకాశం లేనప్పుడు వికెట్ కీపర్, బౌలర్ల నిర్ణయాల ఆధారంగా డీఆర్‌ఎస్ కోరాల్సి వస్తుంది. ఢిల్లీ టీ20లోనూ రిషబ్ పంత్ అభిప్రాయాన్ని విశ్వసించక తప్పలేదు’ అని వెల్లడించాడు.

Read More: రోహిత్ శర్మ దెబ్బకి టీ20ల్లో కోహ్లీ నెం.1 రికార్డ్ బ్రేక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.