యాప్నగరం

ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ 222కే ఆలౌట్

ఓపెనర్ లిటన్ దాస్ (121: 117 బంతుల్లో 12x4, 2x6) శతకం బాదడంతో తొలుత మెరుగైన స్కోరు చేసేలా కనిపించిన బంగ్లాదేశ్ జట్టు.. మిడిల్ ఓవర్లలో వరుస తప్పిదాలు వికెట్లు చేజార్చుకుంది

Samayam Telugu 28 Sep 2018, 9:04 pm
ఆసియా కప్ ఫైనల్లోనూ భారత బౌలర్లు విజృంభించారు. దుబాయ్ వేదికగా ఈరోజు జరుగుతున్న ఫైనల్లో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/45), కేదార్ జాదవ్ (2/41) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 48.3 ఓవర్లలో 222 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్ లిటన్ దాస్ (121: 117 బంతుల్లో 12x4, 2x6) శతకం బాదడంతో తొలుత మెరుగైన స్కోరు చేసేలా కనిపించిన బంగ్లాదేశ్ జట్టు.. మిడిల్ ఓవర్లలో వరుస తప్పిదాలు వికెట్లు చేజార్చుకుంది. ఆ జట్టు‌లో ఇద్దరు స్టంపౌట్, ముగ్గురు రనౌట్ అవ్వడం కొసమెరుపు.
Samayam Telugu 305388719_team-india-784x441


టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో.. ఓపెనర్ హసన్ (32: 59 బంతుల్లో 3x4)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన లిటన్ దాస్ తొలి వికెట్‌కి 20.5 ఓవర్లలోనే అభేద్యంగా 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ దశలో హసన్ ఔటవగా.. అనంతరం వచ్చిన ఇమ్రూల్ (2), ముష్ఫికర్ (5), మహ్మద్ మిథున్ (2) పేలవరీతిలో వరుసగా పెవిలియన్ చేరిపోయారు. అయినప్పటికీ పట్టుదలతో ఆడిన లిటన్ దాస్ కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. కానీ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ ఆడేందుకు ప్రయత్నించి జట్టు స్కోరు 188 వద్ద దాస్ స్టంపౌటవగా.. కొద్దిసేపటికే కెప్టెన్ మొర్తజా (7) కూడా స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో.. ఒత్తిడికి గురైన సౌమ్య సర్కార్ (33), నజ్ముల్లా ఇస్లామ్ (7) రనౌట్‌గా వెనుదిరగడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ పూర్తిగా గాడి తప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.