యాప్నగరం

బంగ్లా కౌంట్‌డౌన్ మొదలు

భారత్‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ పోరాడుతోంది.

TNN 12 Feb 2017, 10:03 am
భారత్‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ పోరాడుతోంది. షకీబుల్ హసన్, కెప్టెన్ ముష్ఫికర్ రహీం, మెహెది హసన్ వీరోచితంగా పోరాడటంతో 322 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో రోజు ఆటను ముగించింది. షకీబ్ (82) పెవిలియన్‌కు చేరినప్పటికీ ముష్ఫికర్ (82 నాటౌట్), హసన్ (51 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.
Samayam Telugu india vs bangladesh only test hyderabad mehedi falls in first over of the day
బంగ్లా కౌంట్‌డౌన్ మొదలు


అయితే 322/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. అర్ధ సెంచరీతో మూడో రోజు అజేయంగా నిలిచిన హసన్ నాలుగో రోజు అదనంగా ఒక్క పరుగు కూడా చేయకుండా ఔటయ్యాడు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో మూడో రోజు భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన బంగ్లా తోక కొంచెం తెగినట్లయింది.

ప్రస్తుతం కెప్టెన్ ముష్ఫికర్ (83 నాటౌట్), తైజుల్ ఇస్లాం (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కాగా, భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, ఇశాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ తీశారు. లంచ్ సమయానికి బంగ్లాను భారత్ ఆలౌట్ చేస్తుందో లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.