యాప్నగరం

షకీబ్ ఆడినా.. ఇంకా కష్టాల్లో బంగ్లా

హైదరాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది.

TNN 11 Feb 2017, 2:46 pm
హైదరాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. మూడో టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఇంకా 441 పరుగులు వెనకబడి ఉంది. ఇంకా చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉండటం వల్ల బంగ్లాపై ఒత్తిడి మరింత పెరిగింది.
Samayam Telugu india vs bangladesh only test hyderabad shakib al hasan batted well post lunch
షకీబ్ ఆడినా.. ఇంకా కష్టాల్లో బంగ్లా


41/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ సమయంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ చెలరేగి ఆడాడు. అర్ధ సెంచరీతో టీంను ఆదుకునే ప్రయత్నం చేసాడు. కెప్టెన్ ముష్ఫికర్ రహీం (47 నాటౌట్) కలిసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 103 బంతుల్లో 82 పరుగులు చేసిన షకీబ్ అశ్విన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బంగ్లా మరోసారి కష్టాల్లో చిక్కుకున్నట్లు అయింది.

షకీబ్ పెవిలియన్‌కు చేరడంతో బరిలోకి దిగిన షబ్బీర్ రహ్మాన్ (16) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీం, మెహెది హసన్ (9) ఉన్నారు. ఒకవేళ భారత్ ఈరోజు బంగ్లాను ఆలౌట్ చేయగలిగితే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చినట్లే. మరోవైపు ఫాలో ఆన్ నుంచి బంగ్లా తప్పించుకోవాలంటే ఇంకా 229 పరుగులు చేయాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.