యాప్నగరం

ఇంగ్లాండ్ గడ్డపై మాట నిలబెట్టుకున్న కోహ్లిసేన

‘ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్‌కి గెలవడం తప్ప మరో మార్గం లేదు. జట్టు సమావేశంలోనూ ఇదే చెప్పా. మూడో టెస్టులో గెలవాలనే

Samayam Telugu 22 Aug 2018, 4:21 pm
‘ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్‌కి గెలవడం తప్ప మరో మార్గం లేదు. జట్టు సమావేశంలోనూ ఇదే చెప్పా. మూడో టెస్టులో గెలవాలనే తపనని ఆటతోనే కాదు.. బాడీ లాంగ్వేజ్‌తోనూ మేము మైదానంలో చూపుతాం’ అని మూడో టెస్టుకి ముందు జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రకటించాడు. తొలి రెండు టెస్టుల్లోనూ ఓడిన నేపథ్యంలో..సిరీస్ చేజారకుండా ఉండాలంటే కచ్చితంగా మూడో టెస్టులో గెలవాలనే కసి కోహ్లిలో ఆరోజు కనిపించింది. అతనే కాదు.. టీమ్ మొత్తం ఆ మాటకి కట్టుబడి బుధవారం ముగిసిన మూడో టెస్టులో సత్తాచాటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించారు.
Samayam Telugu Virat Kohli reuters_2


నాటింగ్‌‌హామ్ వేదికగా గత శనివారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు 161 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. దీంతో.. 168 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న భారత్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌ను 352/7తో డిక్లేర్ చేయగా.. ఇంగ్లాండ్ ముందు 521 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఛేదనలో ఆ జట్టు 317 పరుగులకే చేతులెత్తేయడంతో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో.. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2తో నిలిచింది.

తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.