యాప్నగరం

భారత్‌కి షాకిచ్చిన ఇంగ్లాండ్ పేసర్లు

ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బంతి గమనాన్ని కేఎల్ రాహుల్ అంచనా వేయలేకపోయాడు. దీంతో.. అతని బ్యాట్ పక్క నుంచి వెళ్లిన బంతి ఆఫ్‌స్టంప్‌ను గీరాటేసింది.

Samayam Telugu 2 Sep 2018, 5:24 pm
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో 245 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు తడబడుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగుల ఖాతా కూడా తెరవకుండానే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డవగా.. దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్ (17: 29 బంతుల్లో 3x4), తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన చతేశ్వర్ పుజారా (5) ఓవర్ వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. భారత్ జట్టు 22/3తో కష్టాల్లో పడింది.
Samayam Telugu England v India - Fourth Test


ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బంతి గమనాన్ని కేఎల్ రాహుల్ అంచనా వేయలేకపోయాడు. దీంతో.. అతని బ్యాట్ పక్క నుంచి వెళ్లిన బంతి ఆఫ్‌స్టంప్‌ను గీరాటేసింది. ఆ తర్వాత ఏడో ఓవర్‌లో జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్‌లో పుజారా వికెట్ల ముందు దొరికిపోగా.. 9వ ఓవర్‌లో మళ్లీ అండర్సన్ బౌలింగ్‌లోనే ధావన్ స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

భారత్ జట్టు వరుసగా మూడు వికెట్లు చేజార్చుకున్న తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె (9)తో కలిసి ప్రస్తుతం విరాట్ కోహ్లి (10) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దీంతో.. 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 42/3తో నిలవగా.. విజయానికి ఇంకా 203 పరుగులు చేయాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.