యాప్నగరం

ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టులు ఓ ఛాలెంజ్: కార్తీక్

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టులు ఆడటం ఓ ఛాలెంజ్ అని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. టెస్టు జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ సాహా

Samayam Telugu 29 Jul 2018, 12:32 pm
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టులు ఆడటం ఓ ఛాలెంజ్ అని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. టెస్టు జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ సాహా గాయపడటంతో అతని స్థానంలో కార్తీక్‌కి సెలక్టర్లు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. 2007లో చివరిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు మ్యాచ్‌ ఆడిన దినేశ్ కార్తీక్.. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ అక్కడ టెస్టులు ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో.. మీడియాతో ఈ వికెట్ కీపర్ మాట్లాడాడు. ఆగస్టు 1 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Samayam Telugu india vs england i am excited but nervous too says karthik
ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టులు ఓ ఛాలెంజ్: కార్తీక్


‘ఇంగ్లాండ్‌ గడ్డపై సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ టెస్టులు ఆడబోతున్నందుకు కొంచెం ఆందోళనగానే ఉంది. ఇక్కడ టెస్టులు ఆడటం ఓ సవాల్. జట్టులోని అందరిలానే నేను కూడా ఆ ఛాలెంజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. అప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లలో తాజా పర్యటనకి దినేశ్ కార్తీక్ మాత్రమే ఎంపికయ్యాడు. మిగిలిన వారందరూ రిటైర్మెంట్, పేలవ ప్రదర్శనతో జట్టుకి దూరమయ్యారు. ఇదే విషయాన్ని ఈ వికెట్ కీపర్‌తో ప్రస్తావించగా.. ‘ఆ పర్యటన వివరాలు నాకు సరిగా గుర్తులేవు. కానీ.. నా కెరీర్‌లోనే ఆ పర్యటన ఒక మైలురాయి. రెండు జట్లూ.. తుది జట్టులో మార్పులు చేయకుండా మూడు టెస్టులు ఆడటం చాలా అరుదేమో..?’ అని కార్తీక్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.