యాప్నగరం

బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాస్తా.. సిక్సర్‌గా మారిన వేళ

బుమ్రా విసిరినో బాల్ కారణంగా వికెట్ దక్కాల్సింది కాస్తా.. ఫ్రి హిట్ రూపంలో సిక్సర్ అయ్యింది.

TNN 22 Jan 2017, 4:08 pm
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మూడో వన్డేలో.. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో భారత్‌కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. బుమ్రా వేసిన ఆ ఓవర్ రెండో బంతి ఇయాన్ మోర్గాన్‌ ప్యాడ్లను తాకింది. అప్పీల్ చేయగా.. అంపైర్ తిరస్కరించడంతో కోహ్లి రివ్యూ కోరాడు. బంతి లెగ్ వికెట్ ఆవల పిచ్‌పై పడినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ కూడా నాటౌట్‌గా ఇచ్చాడు. దీంతో రివ్యూ వృథా అయ్యింది. తర్వాతి బంతికి మోర్గాన్ సింగిల్ తీయగా.. మరుసటి బంతిని బెయిర్‌స్టో అప్పర్ కట్‌గా బాదాడు. అది కాస్తా.. థర్డ్ మ్యాన్ దగ్గరున్న అశ్విన్ చేతిలో పడింది. అవుటని భారత జట్టు సంబరాలు చేసుకునే లోగానే రిప్లేలో బుమ్రా విసిరిన బంతి నోబాల్ అని తేలింది. ఫ్రీ హిట్‌ను మోర్గాన్ సిక్సర్‌గా బాదేశాడు. దీంతో వికెట్ దక్కాల్సింది పోయి.. బుమ్రా సిక్సర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Samayam Telugu india vs england third odi live updates bumra gives life to bairstow
బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాస్తా.. సిక్సర్‌గా మారిన వేళ


ఇన్నింగ్స్ 34 ఓవర్లో హార్దిక్ పాండ్య ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్‌ను అవుట్ చేశాడు. బుమ్రా మోర్గాన్ క్యాచ్ పట్టి తన బౌలింగ్‌లో సిక్సర్ బాదినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. 37 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.