యాప్నగరం

తన బ్యాటింగ్‌తో కుంబ్లేను నవ్వించిన పార్థివ్

ఎనిమిదేళ్ల తర్వాత భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పార్థివ్.. కుంబ్లే సహా ఇతర జట్టు సభ్యులను నవ్వించాడు.

TNN 27 Nov 2016, 12:40 pm
మొహాలీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 283 పరుగులకు ఆలౌట్ కాగా, మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది. 26 ఓవర్లలో భారత జట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. 12 రన్స్ చేసిన విజయ్ స్టోక్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందే మొయిన్ అలీ బౌలింగ్‌లో విజయ్‌కు లైఫ్ వచ్చినా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
Samayam Telugu india vs england third test live score parthiv played well in come back match
తన బ్యాటింగ్‌తో కుంబ్లేను నవ్వించిన పార్థివ్


ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడుతున్న పార్థివ్ పటేల్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 85 బంతులు ఆడిన పార్థివ్ 42 పరుగుల వద్ద రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో వోక్స్ విసిరిన బంతి పార్థివ్ షర్ట్‌ను తాకుతూ వెళ్లింది. అయినప్పటికీ అంపైర్ అవుట్ ఇవ్వడంతో పటేల్ రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ పరిశీలనలో ఇది నాటౌట్ అని తేలడంతో పార్థివ్ ఊపిరి పీల్చుకున్నాడు.


తొలుత పార్థివ్ రివ్యూ కోరి బతికిపోగా, తర్వాత ఇంగ్లండ్ జట్టు అదే రివ్యూ కోరి పార్థివ్‌ను పెవిలియన్‌కు పంపింది. రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అపీల్‌ను అంపైర్ తిరస్కరించగా, ఇంగ్లండ్ రివ్యూ కోరింది. అందులో పార్థివ్ అవుటని తేలింది.

స్టోక్స్ వేసిన ఇన్నింగ్స్ 21 ఓవర్ చివరి పార్థివ్ బ్యాట్‌ను తాకగానే అతడి చేతిలో నుంచి బ్యాట్ జారి గ్రౌండ్ మీద పడిపోయింది. కింద పడిన బ్యాట్‌ను తీసుకోకుండానే పార్థివ్ రన్ కోసం పరిగెత్తాడు. ఈ సన్నివేశం చూసి కోచ్ కుంబ్లే సహా టీమిండియా ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.