యాప్నగరం

హాంకాంగ్‌పై పేలవరీతిలో రోహిత్ ఔట్..!

భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

Samayam Telugu 18 Sep 2018, 5:56 pm
ఆసియా కప్‌లో భాగంగా ఈరోజు హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. టాస్ గెలిచిన హాంకాంగ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఓపెనర్ శిఖర్ ధావన్‌(30 నాటౌట్: 34 బంతుల్లో 6x4)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ (23: 22 బంతుల్లో 4x4) తొలి ఓవర్‌లోనే ఫోర్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. కానీ.. జట్టు స్కోరు 45 వద్ద స్పిన్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు.
Samayam Telugu india vs hong kong rohit sharma falls after a cameo
హాంకాంగ్‌పై పేలవరీతిలో రోహిత్ ఔట్..!


రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ చేతికి జట్టు పగ్గాలు వచ్చాయి. దీంతో.. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన ఇషాన్ బౌలింగ్‌లో సిక్స్ కోసం రోహిత్ శర్మ ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి మిడాఫ్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. ఫీల్డర్ నిజాఖత్ సులువుగా క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ధావన్‌తో పాటు అంబటి రాయుడు క్రీజులో ఉన్నాడు. టోర్నీలో భారత్‌కి ఇదే తొలి మ్యాచ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.