IND vs NZ 1st T20: టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒకరికి అరంగేట్రం ఛాన్స్
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం తొలిసారి ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వబోతోంది. 2013లో చివరిగా ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. దాంతో.. పిచ్ ఎలా స్పందిస్తుందో? చూడాలి.
Samayam Telugu 17 Nov 2021, 6:53 pm
ప్రధానాంశాలు:
- న్యూజిలాండ్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
- భారత్ తుది జట్టులో కీలక మార్పులు చేసిన రోహిత్ శర్మ
- వెంకటేశ్ అయ్యర్‌కి అరంగేట్రం ఛాన్స్
- టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మకి మొదటి పరీక్ష
న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా బుధవారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జైపూర్‌లోని ఈ సవాయ్ మాన్సింగ్ స్టేడియం తొలిసారి ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తుండగా.. 2013 నుంచి ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం లేదు. ఇక టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకి ఇదే మొదటి సిరీస్‌కాగా.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ టీమ్‌కి దిశానిర్దేశం చేయనున్నాడు. భారత్ తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కి చోటిచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి అరంగేట్రం ఛాన్సిచ్చాడు. అలానే భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ రూపంలో ముగ్గురు పేసర్లని తీసుకుని.. అశ్విన్, అక్షర్ పటేల్‌కి స్పిన్నర్స్ కోటాలో చోటిచ్చాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో.. జట్టు కూర్పుపై ఓ కన్నేసి ఉంచినట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో ఈ టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టుని కెప్టెన్‌గా టిమ్ సౌథీ నడిపించనున్నాడు.
India (Playing XI): Rohit Sharma(c), KL Rahul, Suryakumar Yadav, Shreyas Iyer, Rishabh Pant(w), Venkatesh Iyer, Axar Patel, Ravichandran Ashwin, Bhuvneshwar Kumar, Deepak Chahar, Mohammed Siraj
New Zealand (Playing XI): Martin Guptill, Daryl Mitchell, Mark Chapman, Glenn Phillips, Tim Seifert(w), Rachin Ravindra, Mitchell Santner, Tim Southee(c), Todd Astle, Lockie Ferguson, Trent Boult