యాప్నగరం

Ind vs NZ 4th ODI: భారత్ ప్రయోగాల బాట.. కోహ్లీ స్థానంలో గిల్..?

న్యూజిలాండ్ గడ్డపై గత ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించిన శుభమన్‌ గిల్.. భారత్-ఎ జట్టు తరఫున కూడా నిలకడగా రాణించాడు.

Samayam Telugu 30 Jan 2019, 1:58 pm
న్యూజిలాండ్ గడ్డపై రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకున్న భారత్ జట్టు.. ప్రపంచకప్ నేపథ్యంలో ప్రయోగాలకి పెద్దపీట వేయాలని యోచిస్తోంది. ఈ మేరకు చివరి రెండు వన్డేల్లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో అండర్-19 ప్రపంచకప్ సంచలనం శుభమన్ గిల్‌కి చోటివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. కివీస్‌తో హామిల్టన్ వేదికగా గురువారం ఉదయం 7.30 గంటలకి నాలుగో వన్డే ప్రారంభంకానుండగా.. 4, 5వ వన్డే, ఆ తర్వాత మూడు టీ20ల నుంచి విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. న్యూజిలాండ్ గడ్డపై ఈ ఐదు మ్యాచ్‌ల్లో టీమ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
Samayam Telugu 100


undefined

న్యూజిలాండ్ గడ్డపై గత ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించిన శుభమన్‌ గిల్.. భారత్-ఎ జట్టు తరఫున కూడా నిలకడగా రాణించాడు. దీంతో.. ఇటీవల సస్పెన్షన్‌కి గురైన కేఎల్ రాహుల్ స్థానంలో అతడ్ని న్యూజిలాండ్ పర్యటనకి సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. తొలి మూడు వన్డేల్లోనూ తుది జట్టులో గిల్‌కి అవకాశం దక్కలేదు. అయితే.. తాజాగా కోహ్లీకి సెలక్టర్లు రెస్ట్ ఇవ్వడంతో అతని స్థానంలో శుభమన్‌ని ఆడించాలని సౌరవ్ గంగూలీ లాంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దీంతో.. గురువారం నాలుగో వన్డేలో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

వన్డే సిరీస్‌ ఇప్పటికే చేజిక్కినందున సీనియర్ ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, మహ్మద్ షమీలో ఒకరికి లేదా ఇద్దరికీ విశ్రాంతినిచ్చి.. ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌కి మరో అవకాశం ఇవ్వడంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ పాలకుల కమిటీ గతవారం కేఎల్ రాహుల్‌తో పాటు హార్దిక్‌ పాండ్యపై ఉన్న సస్పెన్షన్‌ని తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.