యాప్నగరం

టీ20ల్లో భారత్‌కి కలిసొస్తున్న పాండే ‘లక్కీ’ రికార్డ్

భారత టీ20 జట్టులో మనీశ్ పాండేకి గత రెండేళ్లుగా చాలా అరుదుగా అవకాశాలు దక్కుతున్నాయి. కానీ.. అతనికి జట్టులో అవకాశం దక్కిన ప్రతిసారి టీమిండియా గెలిచింది.

Samayam Telugu 1 Feb 2020, 2:58 pm
క్రికెటర్లలో కొంత మందిది గోల్డెన్ హ్యాండ్ అంటుంటారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గతంలో ఈ తరహా ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే కూడా ఆ కోవలోకే వస్తున్నాడని గణాంకాలు చెప్తున్నాయి. ఎంతలా అంటే..? గత రెండేళ్లుగా టీ20 జట్టులో మనీశ్ పాండేకి చోటిచ్చిన ప్రతిసారీ టీమిండియానే గెలుపొందింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? చివరి ఆరు టీ20ల్లోనూ అతను నాటౌట్‌గా నిలిచాడు.
Samayam Telugu Manish Pandey


Read More: నాలుగో టీ20లో టీమిండియా సెలెక్ష‌న్‌ను ప్రశ్నించిన సెహ్వాగ్‌

2018 నుంచి న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 (శుక్రవారం) వరకూ భారత్ తరఫున మనీశ్ పాండే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం ముగిసిన నాలుగో టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన మనీశ్ పాండే భారత్ జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. దీంతో.. ఆదివారం బే ఓవల్ వేదికగా జరిగే ఐదో టీ20లోనూ అతనికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. అతని లక్కీ రికార్డ్ ఆఖరి టీ20లోనూ కొనసాగాలని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.

Read Also: సూప‌ర్ ఓవ‌ర్ల ద్వారా ఎంత‌గానో నేర్చుకున్నా: కోహ్లీ

ఐదు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ముగియగా.. అన్నింటిలోనూ విజయం సాధించిన భారత్ జట్టు ప్రస్తుతం 4-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఐదో టీ20లో కూడా గెలుపొందితే..? కివీస్ గడ్డపై టీ20 సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేసిన ఘనత టీమిండియాకి దక్కనుంది. గతంలో రెండు సార్లు కివీస్ గడ్డపై టీ20 సిరీస్ ఆడిన భారత్ జట్టు.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.