యాప్నగరం

వన్డే సిరీస్‌లో ఫస్ట్ టైమ్.. బుమ్రా జీరో వికెట్

డెత్ ఓవర్లలో తన పదునైన యార్కర్లతో టాప్ బ్యాట్స్‌మెన్‌లను సైతం బోల్తా కొట్టించగల జస్‌ప్రీత్ బుమ్రా.. కివీస్‌పై తాజాగా మూడు వన్డేలాడితే కనీసం వికెట్ బోణి చేయలేకపోయాడు.

Samayam Telugu 11 Feb 2020, 9:39 pm
న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడిపోవడానికి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా లయ తప్పడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. బే ఓవల్ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్.. 3-0తో టీమిండియాని సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో జరిగిన మూడు వన్డేల్లోనూ ఆడిన బుమ్రా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
Samayam Telugu Mumbai: Indian bowler Jasprit Bumrah reacts after bowling a delivery during the ...


గత ఏడాది గాయం కారణంగా మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన బుమ్రా.. ఈ ఏడాది ఆరంభంలో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. పునరాగమనంలో ఈ అగ్రశ్రేణి పేసర్ మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో తన పదునైన యార్కర్లని సంధించడంలో బుమ్రా తేలిపోతున్నాడు. దీంతో.. ప్రత్యర్థి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు సైతం బుమ్రా బౌలింగ్‌లో అలవోకగా పరుగులు రాబట్టేస్తున్నారు.

కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 30 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 5.56 ఎకానమీతో 167 పరుగులిచ్చాడు. కానీ.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఇప్పుడు టీమిండియాలో కంగారు పెంచుతోంది. భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన తర్వాత ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో బుమ్రా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం ఇదే తొలిసారి.

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. కనీసం టెస్టుల్లోనైనా ఈ పేసర్ లయ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.