యాప్నగరం

చెలరేగిన భారత్ బౌలర్లు.. కివీస్ 235కే ఆలౌట్

కివీస్‌తో టెస్టు సిరీస్‌ ముంగిట భారత్ ఫాస్ట్ బౌలర్ల మళ్లీ టచ్‌లోకి వచ్చారు. వన్డేల్లో వికెట్ బోణి చేయలేకపోయిన బుమ్రా.. ఈరోజు మ్యాచ్‌లో ఫస్ట్ వికెట్ పడగొట్టడం విశేషం.

Samayam Telugu 15 Feb 2020, 11:57 am
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తేలిపోయిన భారత్ బౌలర్లు ఎట్టకేలకి లయ అందుకున్నారు. న్యూజిలాండ్ ఎలెవన్ టీమ్‌తో తాజాగా జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ (3/17), జస్‌ప్రీత్ బుమ్రా (2/18), నవదీప్ సైనీ(2/58)తో పాటు ఉమేశ్ యాదవ్ (2/49)తో సత్తాచాటారు. దీంతో.. ఈరోజు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకే కుప్పకూలిపోయింది. శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.
Samayam Telugu Kolkata: Indian bowler Umesh Yadav being greeted by his teammates after he dismi...


మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఈరోజు ఆరంభంలోనే వికెట్ పడగొట్టి భారత్‌కి శుభారంభమిచ్చాడు. ఓపెనర్ విల్ యంగ్ (2) మూడో ఓవర్‌లోనే బుమ్రాకి వికెట్ సమర్పించుకోగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (34) పేసర్ ఉమేశ్ యాదవ్‌కి దొరికిపోయాడు. దీంతో.. ఒత్తిడికి గురైన ఆ జట్టు ఏ దశలోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఆ జట్టులో హెన్రీ కూపర్ (40: 68 బంతుల్లో 6x4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. 74.2 ఓవర్లలోనే ఆ జట్టు 235 పరుగులకి పరిమితమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసిన భారత్ జట్టుకి 28 పరుగుల ఆధిక్యం లభించగా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 59/0తో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన ఓపెనర్లు పృథ్వీ షా (35 బ్యాటింగ్: 25 బంతుల్లో 5x4, 1x6), మయాంక్ అగర్వాల్ 23 బ్యాటింగ్: 17 బంతుల్లో 4x4, 1x6) ఆఖరి సెషన్‌లో పోటీపడి మరీ బౌండరీలు బాదేశారు. దీంతో.. టీ20 తరహాలో 7 ఓవర్లలోనే టీమిండియా 59 పరుగులు చేయగలిగింది. ఈ నెల 21 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.