యాప్నగరం

ఆసియా కప్ వచ్చేస్తోంది.. భారత్, పాక్ ఢీ..!

క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు మళ్లీ ఆసియా కప్ వచ్చేస్తోంది. దుబాయ్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి జరగనున్న

Samayam Telugu 25 Jul 2018, 11:38 am
క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు మళ్లీ ఆసియా కప్ వచ్చేస్తోంది. దుబాయ్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసింది. టోర్నీలో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ జట్లు పాల్గొంటున్నట్లు ప్రకటించిన ఐసీసీ.. ఒక స్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేషియా, హాంకాంగ్ జట్లు పోటీలో ఉన్నట్లు వెల్లడించింది. టోర్నీలో భాగంగా భారత్ జట్టు సెప్టెంబరు 19న దాయాది పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
Samayam Telugu Virat_KOHLI_VS_PAK_CT_Getty


భారత్ , పాకిస్థాన్, ఒక క్వాలిఫయర్‌ జట్టుతో కలిసి గ్రూప్-ఎ‌లో ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ ఉన్నాయి. సెప్టెంబరు 15న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా.. 28న ఫైనల్‌తో ముగియనుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కి అర్హత సాధించి.. అందులో టాప్-2లో నిలిచిన జట్లు తుదిపోరులో కప్‌ కోసం ఢీకొంటాయి.

బంగ్లాదేశ్ వేదికగా 2016లో ఆసియా కప్ జరగగా.. భారత్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ వర్షం కారణంగా కుదించిన 15 ఓవర్లలో 120 పరుగులు చేయగా.. భారత్ 13.5 ఓవర్లలోనే 122/2తో అలవోకగా విజయాన్ని అందుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.