యాప్నగరం

భారత్‌పై పాక్ క్రికెట్ వారసుల కామెడీ రనౌట్

అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్.. దశాబ్దాలుగా రనౌట్లలోనూ తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. రాబోవు తరం కూడా ఆ వారసత్వాన్ని కొనసాగించబోతున్నట్లు అండర్-19 వరల్డ్‌కప్ వేదికగా స్పష్టం చేసింది.

Samayam Telugu 5 Feb 2020, 10:36 am
క్రికెట్‌లో కామెడీగా రనౌటవడంలో పాకిస్థాన్ ఆటగాళ్ల తర్వాతే ఎవరైనా..! మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఒకే ఎండ్‌ వైపు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు పరుగెత్తడం పాకిస్థాన్‌కే చెల్లింది. సీనియర్ క్రికెటర్లే కాదు.. ఆ దేశ జూనియర్లు కూడా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లు తాజాగా అండర్-19 ప్రపంచకప్‌లో స్పష్టమైంది.
Samayam Telugu IND vs PAK Under -19


Read More: undefined

దక్షిణాఫ్రికా గడ్డపై ప్రస్తుతం అండర్-19 వరల్డ్‌కప్‌ జరుగుతుండగా.. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌తో ఢీకొట్టిన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ యంగ్ టీమ్ 43.1 ఓవర్లలోనే 172 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని భారత యువ జట్టు 35.2 ఓవర్లలోనే 176/0తో అలవోకగా ఛేదించేసింది. ఇక ఆదివారం టోర్నీ ఫైనల్ జరగనుంది.


మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ ఖాసీమ్ అక్రమ్ రనౌటయిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది. భారత బౌలర్ రవి బౌలింగ్‌లో బంతిని హిట్ చేసిన ఖాసీమ్.. నాన్‌స్టైక్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ రోహైల్‌ని సింగిల్ కోసం పిలిచాడు. దీంతో.. సులువుగా సింగిల్ వచ్చేలా కనిపించింది. కానీ.. బంతి నేరుగా ఫీల్డర్ ఆంకోలేకర్ చేతుల్లోకి వెళ్లడంతో సింగిల్‌ కోసం పిచ్ మధ్యలోకి వెళ్లిన పాక్ బ్యాట్స్‌మెన్ మధ్య తికమక మొదలైంది. దీంతో.. అనూహ్యంగా ఇద్దరూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు నువ్వా నేనా అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. మరోవైపు అప్పటికే బంతిని అందుకున్న ఆంకోలేకర్.. నవ్వుతూ కీపర్ ధ్రువ్‌ చేతికి బంతినివ్వడంతో పాక్ బ్యాట్స్‌మెన్ ఖాసీమ్ రనౌటవక తప్పలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.