యాప్నగరం

భారత్‌పై షోయబ్ మాలిక్ హాఫ్ సెంచరీ..!

ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాహల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత మళ్లీ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమవుతూ కెరీర్‌లో 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

Samayam Telugu 23 Sep 2018, 7:28 pm
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆరంభంలోనే ఆ జట్టుని 58/3తో భారత్‌ ఒత్తిడిలోకి నెట్టింది. కానీ.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (52 నాటౌట్: 67 బంతుల్లో 3x4,1x6) పట్టుదలతో అర్ధశతకం బాది పాక్‌‌ని మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (38 నాటౌట్: 60 బంతుల్లో 2x4)తో కలిసి మాలిక్ నాలుగో వికెట్‌కి అభేద్యంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 36 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ 146/3తో నిలిచింది.
Samayam Telugu india vs pakistan shoaib malik sarfraz ahmed revive pakistan innings
భారత్‌పై షోయబ్ మాలిక్ హాఫ్ సెంచరీ..!


అంతకముందు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (10), బాబర్ అజామ్ (9) నిరాశపరిచినా.. ఫకార్ జమాన్ (31: 44 బంతుల్లో 1x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. జమాన్ ఔటవడంతో జట్టు స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న మాలిక్.. సహనంతో భారత బౌలర్లని ఎదుర్కొన్నాడు. మధ్యలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాహల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత మళ్లీ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమవుతూ కెరీర్‌లో 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అఫ్గానిస్థాన్‌పై అజేయ అర్ధశతకంతో పాక్ జట్టుని చివరి ఓవర్‌లో షోయబ్ మాలిక్‌ గెలిపించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.