యాప్నగరం

తొలిటెస్టులో ఒకే ఒక్కడు.. హార్దిక్ పాండ్య

దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ బౌలర్లకి ఎదురునిలిచి ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్

TNN 6 Jan 2018, 6:22 pm
దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ బౌలర్లకి ఎదురునిలిచి ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్ అర్ధశతకంతో మెరిశాడు. టెస్టుల్లో అపార అనుభవం ఉన్న ఆటగాళ్లు సైతం తడబడుతున్న పిచ్‌పై వరుస బౌండరీల మోత మోగించి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అతనే గత ఏడాది శ్రీలంకపై టెస్టుల్లో మెరుపు శతకం బాది సుదీర్ఘ ఫార్మాట్‌లో తన ఆగమనాన్ని చాటిన హార్దిక్ పాండ్య. టీమిండియా 76/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచిన దశలో క్రీజులో వచ్చిన పాండ్య 46 బంతుల్లోనే 10 ఫోర్ల సాయంతో అర్ధశతకం బాదేసి సఫారీ బౌలర్లకి సవాల్ విసిరాడు.
Samayam Telugu india vs south africa 1st test day 2 at cape town pandya counterattacks with fifty
తొలిటెస్టులో ఒకే ఒక్కడు.. హార్దిక్ పాండ్య


‘హార్దిక్ పాండ్య క్రీజులోకి రాగానే హిట్టింగ్ చేస్తే ఫర్వాలేదు.. అతను సహనంతో ఉండి తర్వాత చెలరేగితేనే ప్రమాదం’ తొలి టెస్టుకి ముందు దక్షిణాఫ్రికా జట్టుకి ఆ దేశ మాజీ క్రికెటర్లు చేసిన హెచ్చరిక. వాళ్లు ఎవరూ కోహ్లి, పుజారా, రహనె గురించి మాట్లాడలేదు. కేవలం హార్దిక్ గురించే హెచ్చరించారు. వారి ఊహే నిజమైంది. మురళీ విజయ్ (1), ధావన్ (16), పుజారా (26), కోహ్లి (5), రోహిత్ శర్మ (5), అశ్విన్ (12), సాహా (0) తక్కువ స్కోరుకే వికెట్ సమర్పించుకున్నా హార్దిక్ మాత్రం ప్రస్తుతం 60 బంతుల్లో 13x4, 1x6 సాయంతో 75 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ 165/7తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.