యాప్నగరం

వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న భారత్

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన శనివారం కూడా కొనసాగుతోంది. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న

TNN 6 Jan 2018, 5:02 pm
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన శనివారం కూడా కొనసాగుతోంది. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంచ్ విరామ సమయానికి 76/4తో నిలిచిన టీమిండియా.. బ్రేక్ తర్వాత తొలి బంతికే చతేశ్వర్ పుజారా (26: 92 బంతుల్లో 5x4) వికెట్ చేజార్చుకుంది. ఆఫ్ స్టంప్‌కి దూరంగా ఫిలాండర్ విసిరిన బంతిని.. పాయింట్ దిశగా నెట్టేందుకు పుజారా ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్‌లో ఫీల్డర్ డుప్లెసిస్ చేతుల్లో పడింది. దీంతో 76/5తో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
Samayam Telugu india vs south africa 1st test day 2 at cape town pujara falls right after lunch
వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న భారత్


ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌ నైట్ స్కోరు 28/3తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టుకి ఆదిలోనే షాక్ తగిలింది. క్రీజులో తడబడిన రోహిత్ శర్మ (11) జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఔటవగా.. తర్వాత పుజారా, అనంతరం కొద్దిసేపటికే అశ్విన్ (12) కూడా పెవిలియన్ చేరిపోయాడు. దీంతో 38.5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 81/6తో నిలిచింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.