యాప్నగరం

భారత్ సఫారీ జర్నీ.. ఓటమితో మొదలు

దక్షిణాఫ్రికా పర్యటనని ఘోర పరాజయంతో భారత్ ఆరంభించింది. కేప్‌ టౌన్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టులో 208

TNN 8 Jan 2018, 8:41 pm
దక్షిణాఫ్రికా పర్యటనని పరాజయంతో భారత్ ఆరంభించింది. కేప్‌ టౌన్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టులో 208 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 135 పరుగులకే కుప్పకూలిపోయింది. జట్టులో రవిచంద్రన్ అశ్విన్ (37: 53 బంతుల్లో 5x4) ఒక్కడే కాసేపు దక్షిణాఫ్రికా జట్టుని ప్రతిఘటించాడు. ఆటలో నాలుగో రోజైన సోమవారం ఓవర్‌ నైట్ స్కోరు 65/2తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ జట్టుని 130కే ఆలౌట్ చేసిన భారత్ జట్టు.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు.
Samayam Telugu india vs south africa 1st test day 4 at cape town sa cruise past ind by 72 runs
భారత్ సఫారీ జర్నీ.. ఓటమితో మొదలు


తొలి ఇన్నింగ్స్ తరహాలోనే రెండో ఇన్నింగ్స్‌లోనూ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తయడంతో 41.2 ఓవర్లలోనే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు మురళీ విజయ్ (13), శిఖర్ ధావన్ (16) ఆదిలోనే పెవిలియన్ చేరిపోగా.. చతేశ్వర్ పుజారా (4), విరాట్ కోహ్లి (28), రోహిత్ శర్మ (10), సాహా (8), హార్దిక్ (1) వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టేశారు. తాజా విజయంతో మూడు టెస్టుల ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకి ఆలౌటవగా.. శనివారం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకి కుప్పకూలిన విషయం తెలిసిందే.

వర్షం కారణంగా ఆదివారం ఆట పూర్తిగా రద్దవగా.. నాలుగో రోజైన సోమవారం మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తిని రెట్టింపు చేస్తూ భారత బౌలర్లు చెలరేగారు. తొలి సెషన్‌ ఆరంభంలోనే మహ్మద్ షమీ పదునైన బంతులతో హసీమ్ ఆమ్లా (4), రబాడ (5)‌ని పెవిలియన్‌కి పంపగా.. తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా చెలరేగాడు. కెప్టెన్ డుప్లెసిస్ (0), డికాక్ (8) బుమ్రా బంతుల్ని అర్థంచేసుకోలేక వికెట్ సమర్పించుకున్నారు.

ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. హిట్టర్ డివిలియర్స్ భారీ షాట్లతో భారత్‌ని కాస్త కంగారుపెట్టాడు. అయితే దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 130 వద్ద డివిలియర్స్ సిక్స్ కొట్టే ప్రయత్నంలో బుమ్రా బౌలింగ్‌లోనే భువనేశ్వర్‌ చేతికి చిక్కాడు. గాయం కారణంగా.. తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే బౌలింగ్‌ చేయకుండా డగౌట్‌కి వెళ్లిపోయిన డేల్ స్టెయిన్ బ్యాటింగ్‌కి వచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.