యాప్నగరం

మ్యాచ్ ముగిసే టైమ్‌లో లంచ్ బ్రేక్..!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూల్ అంటే రూల్.. అది పసికూన జట్టుకైనా.. అగ్రశ్రేణి జట్టుకైనా ఒకటే. మ్యాచ్ ఎలాంటి

TNN 4 Feb 2018, 5:42 pm
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూల్ అంటే రూల్.. అది పసికూన జట్టుకైనా.. అగ్రశ్రేణి జట్టుకైనా ఒకటే. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. అంపైర్లు కఠినంగా నిబంధనలు పాటిస్తారు. దీనికి ఉదాహరణ.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరుగుతున్న రెండో వన్డే కొద్ది నిమిషాల్లోనే ముగుస్తుందన్న దశలో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇవ్వడం. 119 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు శిఖర్ ధావన్ (51: 50 బంతుల్లో 9x4), విరాట్ కోహ్లి (44: 47 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడటంతో 19 ఓవర్లు ముగిసే సమయానికి 117/1తో నిలిచిన దశలో అంపైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు.
Samayam Telugu india vs south africa 2018 2nd odi in centurion lunch has been taken with india requiring just 2 runs to win
మ్యాచ్ ముగిసే టైమ్‌లో లంచ్ బ్రేక్..!


స్టేడియంలోని సిబ్బందితో పాటు.. టీవీల్లో మ్యాచ్‌ని చూస్తున్న అభిమానులకి కూడా అసలేం జరిగిందో..? కొద్దిసేపటి వరకు అర్థం కాలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులో నుంచి వెలుపలికి వస్తూ.. ఫీల్డ్ అంపైర్లతో ఏదో అసహనంగా మాట్లాడుతున్నట్లు కనిపించడంతో.. ఆ ఆసక్తి రెట్టింపైంది. కానీ.. ఆ తర్వాత లంచ్‌ బ్రేక్ అని తెలియగానే.. ఏంటి కామెడీ చేస్తున్నారా..? అంటూ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మరో 2 పరుగులు చేస్తే మ్యాచ్ ముగుస్తుందన్న దశలో బ్రేక్ ఇవ్వడమేంటి..? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ.. ఐసీసీ రూల్ అంటే.. రూలే మరి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.