యాప్నగరం

సఫారీలను 194కే కూల్చిన భారత్

జొహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు

TNN 25 Jan 2018, 8:03 pm
జొహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు 6/1తో ఆటలో రెండో రోజైన గురువారం తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా (5/54), భువనేశ్వర్ కుమార్ (3/44) ధాటికి 194 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో హసీమ్ ఆమ్లా (61: 121 బంతుల్లో 7x4) అర్ధశతకంతో ఫర్వాలేదనిపించగా.. ఫిలాండర్ (35), రబాడ (30) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత్ జట్టు బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకి ఆలౌటైన నేపథ్యంలో దక్షిణాఫ్రికాకి 7 పరుగుల ఆధిక్యం దక్కింది.
Samayam Telugu india vs south africa 3rd test day 2 at johannesburg south africa manage 7 run lead
సఫారీలను 194కే కూల్చిన భారత్


గురువారం ఆరంభ ఓవర్లలోనే డీన్ ఎల్గర్ (4) వికెట్ తీసి సఫారీలకి భువనేశ్వర్ కుమార్ షాకివ్వగా.. నైట్ వాచ్‌మెన్ రబాడని ఇషాంత్ శర్మ బోల్తా కొట్టించాడు. అనంతరం వచ్చిన ఏబీ డివిలియర్స్ (5) భువనేశ్వర్ బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ సమర్పించుకోగా.. కెప్టెన్ డుప్లెసిస్ (8), డికాక్ (8)లను జస్‌ప్రీత్ బుమ్రా క్రీజులో కుదురుకోనీయకుండా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో తక్కువ స్కోరుకే దక్షిణాఫ్రికా పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన హసీమ్ ఆమ్లా.. టెయిలెండర్ల సాయంతో జట్టు స్కోరు బోర్డుని నడిపించాడు. చివర్లో మళ్లీ బుమ్రానే ఆమ్లాని ఔట్ చేయగా.. ఫిలాండర్ కాసేపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.