యాప్నగరం

కుప్పకూలిన టాపార్డర్.. కష్టాల్లో భారత్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ కష్టాల్లో పడింది.

TNN 17 Nov 2017, 10:13 am
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలిరోజు వర్షం వల్ల దాదాపు 80 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఇక పిచ్‌పై పడిన 11.5 ఓవర్లు ఆడటం భారత బ్యాట్స్‌మెన్‌కు గగనమైపోయింది. శ్రీలంక పేస్‌బౌలర్‌ లక్మల్‌ ధాటికి బెంబేలెత్తిన టీమ్‌ ఇండియా 17 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. కోహ్లి, రాహుల్‌ డకౌట్‌ కాగా.. ధావన్‌ ఎనిమిది పరుగులకు పెవిలియన్‌కు చేరాడు. ఈ ముగ్గురినీ ఔట్‌ చేసిన లక్మల్‌.. ఆరు ఓవర్లలో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం.
Samayam Telugu india vs sri lanka 1st test kohli duck out shanaka strikes early on day 2
కుప్పకూలిన టాపార్డర్.. కష్టాల్లో భారత్


17/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆజింక్య రహానేను శనక ఔట్ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి రహానే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఛటేశ్వర పుజారా (23, 69 బంతుల్లో 5×4), రవిచంద్రన్ అశ్విన్ (4, 16 బంతుల్లో 1×4) క్రీజులో ఉన్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 40 పరుగులు చేసింది. పరిస్థితి చూస్తుంటే భారత్‌ను పుజారానే ఆదుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈడెన్ పిచ్ ఇప్పుడు బౌలర్లకు అనుకూలంగా ఉంది. దాన్ని శ్రీలంక సద్వినియోగం చేసుకుంటోంది. ఈ పిచ్‌పై కనీసం 200 దాటినా శ్రీలంకకు గట్టి పోటీ ఇచ్చినట్లే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.