యాప్నగరం

భారత్‌తో తలపడే శ్రీలంక టెస్టు టీమ్ ఇదే..!

అనారోగ్యం కారణంగా ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్

TNN 23 Jul 2017, 8:28 pm
భారత్‌తో బుధవారం నుంచి ఆరంభంకానున్న తొలి టెస్టు కోసం శ్రీలంక సెలక్టర్లు జట్టును ప్రకటించారు. అనారోగ్యం కారణంగా ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ తొలి టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. చండిమాల్ స్థానంలో జట్టులోకి ధనంజయ డిసిల్వాకి సెలక్టర్లు అవకాశమిచ్చారు.
Samayam Telugu india vs sri lanka 2017 hosts announce squad for first test
భారత్‌తో తలపడే శ్రీలంక టెస్టు టీమ్ ఇదే..!


మరోవైపు భారత్ జట్టులో కూడా రెగ్యులర్ టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ ఫిటెనెస్ సాధించలేకపోవడంతో అతని స్థానంలో శిఖర్ ధావన్‌కి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన వార్మప్ మ్యాచ్‌లో దొరికిన అవకాశాన్ని ఓపెనర్ అభినవ్ ముకుంద్ వృథా చేసుకున్నాడు. దీంతో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి శిఖర్ ధావన్‌ జట్టు ఇన్నింగ్స్‌ని ప్రారంభించవచ్చు.

శ్రీలంక జట్టు: హెరాత్, ఉపుల్ తరంగ, గుణరత్నే, కుశాల్ మెండిస్, మాథ్యూస్, కరుణరత్నే, డిక్వెల్లా, డిసిల్వా, గుణతిలక, పెరీరా, లక్మల్, విశ్వ, మలింద, ప్రదీప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.