యాప్నగరం

మొహాలి వన్డేలో రోహిత్ శతకం..!

శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ (100 నాటౌట్: 115 బంతుల్లో 9x4,

TNN 13 Dec 2017, 2:08 pm
శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ (100 నాటౌట్: 115 బంతుల్లో 9x4, 1x6) అజేయ శతకంతో చెలరేగాడు. తొలి వన్డేలో కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటై నిరాశపరిచిన రోహిత్ శర్మ తాజా వన్డేలో క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మది‌గా ఆడి అనంతరం గేర్ మార్చి వరుస బౌండరీలు బాదేశాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్ వేసిన లక్మల్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా తన స్టైల్ బౌండరీతో జోరు అందుకున్న ఈ కెప్టెన్ తొలి వికెట్‌కి శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9x4)తో కలిసి అభేద్యంగా 115 పరుగుల భాగస్వామ్యం‌తో జట్టు భారీ స్కోరుకి బాటలు వేశాడు.
Samayam Telugu india vs sri lanka 2nd odi at mohali 100 for rohit sharma
మొహాలి వన్డేలో రోహిత్ శతకం..!


కెప్టెన్‌గా రోహిత్ శర్మకి ఇది తొలి శతకం కాగా.. వన్డే‌ల్లో 16వ శతకం కావడం విశేషం. అతనితో పాటు క్రీజులో ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ (61 నాటౌట్: 55 బంతుల్లో 6x4, 1x6) ఉన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 122 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కొనసాగుతుండటంతో భారత్ జట్టు 39.3 ఓవర్లు ముగిసే సమయానికి 237/1తో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.