యాప్నగరం

విశాఖలో లంక విలవిల.. భారత్ టార్గెట్ 216

విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న విజేత నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు.

TNN 17 Dec 2017, 4:58 pm
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న విజేత నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. చాహల్ (3/46), కుల్దీప్ యాదవ్ (3/42), హార్దిక్ పాండ్య (2/49) ధాటికి.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 215 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (95: 82 బంతుల్లో 12x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టుకి శుభారంభమిచ్చినా.. మిడిలార్డర్‌ ఘోరంగా తడబడింది. సమరవిక్రమ (42), మాథ్యూస్ (17), డిక్వెల్లా (8), కెప్టెన్ తిసార పెరీరా (6) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌ 44.5 ఓవర్లలోనే ముగిసింది.
Samayam Telugu india vs sri lanka 3rd odi at visakhapatnam india need 216 to win series
విశాఖలో లంక విలవిల.. భారత్ టార్గెట్ 216


మూడు వన్డేల ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ గుణతిలక (13: 12 బంతుల్లో 2x4)ని ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్‌కి పంపి జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియాకి బ్రేక్ ఇచ్చినా.. సమరవిక్రమతో కలిసి ఉపుల్ తరంగ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో వరుసగా 4, 4, 4, 4, 4 బాదిన తరంగ.. భారత్ బౌలర్లపై బౌండరీలతో ఎదురుదాడికి దిగి వేగంగా శతకం వైపు దూసుకెళ్లాడు. కానీ.. ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో ధోనీ తెలివిగా తరంగని స్టంపౌట్ చేయడంతో లంక ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా తడబాటు మొదలైంది. అప్పటికి 160/3తో నిలిచిన లంక జట్టు చాహల్, కుల్దీప్ జోరుతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివర్లో అసేల గుణరత్నె (17: 51 బంతుల్లో), నువాన్ ప్రదీప్ (0 నాటౌట్: 11 బంతుల్లో) డిఫెన్స్‌తో భారత్ బౌలర్లకి ఎదురునిలిచి జట్టు ఆలౌటవకుండా కాసేపు నియంత్రించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.