యాప్నగరం

ధోనీతో ఆడా.. టీమ్‌లో ఛాన్స్ ఎప్పుడో..?

భారత్‌ తుది జట్టులో ఛాన్స్‌ కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవల టీమిండియాకి ఎంపికైన యువ ఆల్‌రౌండర్

TNN 12 Dec 2017, 4:40 pm
భారత్‌ తుది జట్టులో ఛాన్స్‌ కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవల టీమిండియాకి ఎంపికైన యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెల్లడించాడు. గత కొంతకాలంగా ఐపీఎల్, తమిళనాడు ప్రీమియర్ లీగ్, దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న 18 ఏళ్ల వాషింగ్టన్‌ సుందర్‌ని భారత సెలక్టర్లు శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేశారు. అయితే.. గత ఆదివారం ముగిసిన తొలి వన్డేకి ముందు ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ గాయం కారణంగా జట్టుకి దూరమవడంతో అతని స్థానంలో వన్డే సిరీస్‌కూ సుందర్‌కి సెలక్టర్లు అవకాశం కల్పించారు. కానీ.. ధర్మశాల వన్డేలో భారత్ తుది జట్టులో అతనికి చోటు దక్కకపోవడంతో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.
Samayam Telugu india vs sri lanka i have the game to play for india says 18 year old washington sundar
ధోనీతో ఆడా.. టీమ్‌లో ఛాన్స్ ఎప్పుడో..?


మొహాలి వేదికగా శ్రీలంకతో బుధవారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో మంగళవారం వాషింగ్టన్ సుందర్ మాట్లాడాడు. తొలి వన్డే తుది జట్టులో చోటు దక్కకపోవడం నిరాశ కలిగించిందా..? అని ప్రశ్నించగా.. ‘ఏ క్రికెటర్‌కైనా.. భారత్ జట్టుకి ఆడటం చిరకాల స్వప్నం. 18 ఏళ్లకే ఆ కల తీరే అవకాశం నాకు వచ్చింది. టీమిండియాకి ఎంపికవడం మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభూతి. నా కష్టించేతత్వమే ఈ స్థాయికి చేర్చిందని నమ్ముతున్నా’ అని సుందర్ వివరించాడు.

తొలిసారి భారత్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకున్నారు. ఆ అనుభం ఎలా ఉంది..? అని ప్రశ్నించగా.. ‘భారత్ జట్టుతో కలిసి నా ప్రయాణం నాలుగో రోజుకి చేరింది. కొత్తగా జట్టుతో చేరినట్లు నాకు ఏమీ అనిపించలేదు. ఎందుకంటే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు నాకు ముందే తెలుసు. మహేంద్రసింగ్ ధోనీతో కలిసి చాలా రోజులు ఐపీఎల్‌ ఆడాను. జట్టులోని ఆటగాళ్లందరూ కొత్త అనే భావన నాకు కలగకుండా చూశారు. శ్రీలంకతో సిరీస్‌లో ఛాన్స్‌ దొరుకుతుందనే ధీమాతో ఉన్నా’ అని వాషింగ్టన్ సుందర్ వెల్లడించాడు. తొలి వన్డేలో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.