యాప్నగరం

పుణె వన్డేలో కోహ్లీ ఔట్‌కి పక్కా స్కెచ్..?

మిడ్‌ వికెట్, లాంగాన్‌లో మాత్రమే బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్లని ఉంచిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్.. క్రీజులో ఉన్న కోహ్లీని ఫుల్‌షాట్ ఆడేలా ప్రేరేపించాడు

Samayam Telugu 28 Oct 2018, 12:53 pm
పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో పక్కా వ్యూహంతోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని వెస్టిండీస్ టీమ్ బోల్తా కొట్టించినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు 47.4 ఓవర్లలో 240 పరుగులకే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో శతకం బాదిన కెప్టెన్ విరాట్ కోహ్లి (107: 119 బంతుల్లో 10x4, 1x6) కీలక సమయం(220 స్కోరు వద్ద)లో ఔటవడంతోనే.. భారత్ చేతి నుంచి మ్యాచ్ చేజారింది. అయితే.. పక్యా వ్యూహంతోనే కోహ్లీని వెస్టిండీస్ బుట్టలో వేసినట్లు బౌలర్ శామ్యూల్స్ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
Samayam Telugu india vs west indies 3rd odi highlights marlon samuels bowling efforts come despite limited practice
పుణె వన్డేలో కోహ్లీ ఔట్‌కి పక్కా స్కెచ్..?


ఇన్నింగ్స్ 42వ ఓవర్, శామ్యూల్స్ మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే విరాట్ కోహ్లిని బౌల్డ్ చేశాడు. వాస్తవానికి కాలి గాయం కారణంగా.. గత కొంతకాలంగా బౌలింగ్‌కి దూరంగా ఉంటున్న శామ్యూల్స్ నెట్స్‌లో కనీసం ప్రాక్టీస్ కూడా చేయట్లేదట. అయినప్పటికీ.. పుణె వన్డేలో అతను విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన కోహ్లి.. క్లీన్ బౌల్డయ్యాడు. మిడ్‌ వికెట్, లాంగాన్‌లో మాత్రమే బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్లని ఉంచిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్.. క్రీజులో ఉన్న కోహ్లీని ఫుల్‌షాట్ ఆడేలా ప్రేరేపించాడు. అప్పటికే క్రీజులో ప్రధాన బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో కోహ్లీ కూడా సాహసోపేత షాట్‌‌కి ప్రయత్నించి బౌల్డయ్యాడు.

‘మోకాలి గాయం నుంచి నేను ఇటీవల కోలుకోవడంతో.. నెట్స్‌లో కూడా బౌలింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు. సిరీస్‌లో నేను బ్యాట్‌తో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోవడంతో.. కనీసం బౌలింగ్‌తోనైనా.. మ్యాచ్‌ని మలుపు తిప్పినందుకు సంతోషంగా ఉంది’ అని మ్యాచ్ అనంతరం శామ్యూల్స్ చెప్పుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.