యాప్నగరం

రాహుల్‌ని వన్డేల్లో ఆడించాలి: గంగూలీ

కెప్టెన్ కోహ్లీ మాత్రం.. కేఎల్ రాహుల్‌ని మూడో ఓపెనర్‌గానే తాము చూస్తున్నామని ఇప్పటికే స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌‌లలో ఎవరో ఒకరిని తప్పిస్తే తప్ప రాహుల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Samayam Telugu 29 Oct 2018, 12:08 pm
భారత ప్రత్యామ్నాయ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని వన్డేల్లో ఆడిస్తే మంచిదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కి సెలక్టర్లు చోటిచ్చినా.. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల్లోనూ అతనికి తుది జట్టులో ఛాన్స్ లభించలేదు. దీంతో.. అతను రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
Samayam Telugu Virat-Kohli-and-KL-Rahul


మరోవైపు టీమిండియా మేనేజ్‌మెంట్.. జట్టు మిడిలార్డర్‌ బలహీనతపై ఆందోళన చెందుతుండటంతో రాహుల్ చేరికతో ఆ బలహీనతని కొంతమేర అధిగమించవచ్చని గంగూలీ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ కోహ్లీ మాత్రం.. కేఎల్ రాహుల్‌ని మూడో ఓపెనర్‌గానే తాము చూస్తున్నామని ఇప్పటికే స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌‌లలో ఎవరో ఒకరిని తప్పిస్తే తప్ప రాహుల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

‘భారత్ జట్టు మిడిలార్డర్ బలహీనత గురించి అతిగా ఆలోచిస్తోంది. కానీ.. ఆ సమస్య తీరాలంటే రాహుల్ రిజర్వ్ బెంచ్‌పై ఉండకుండా తుది జట్టులోకి రావాలి. అతని చేరికతో జట్టులో కూడా సమతూకం లభిస్తుంది. సెలక్టర్లు అతని విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు’ అని గంగూలీ వెల్లడించాడు.

భారత్, వెస్టిండీస్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో ఈరోజు నాలుగో వన్డే జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.