యాప్నగరం

India vs WI 4th ODI: ముంబయి వన్డేలో రోహిత్ శర్మ 162 ఔట్..!

విండీస్ బౌలర్లని ఉతికారేస్తూ 98 బంతుల్లో 13x4, 1x6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్ శర్మ.. వన్డే కెరీర్‌లో 21వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Samayam Telugu 29 Oct 2018, 4:50 pm
వెస్టిండీస్‌తో ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈరోజు జరుగుతున్న నాలుగో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20x4, 4x6) రికార్డు స్కోరుతో చెలరేగాడు. 98 బంతుల్లో 13x4, 1x6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్ శర్మ.. ఆ తర్వాత కేవలం 33 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని అందుకుని వ్యక్తిగత స్కోరు 162 వద్ద ఔటయ్యాడు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు 43.5 ఓవర్లు ముగిసే సమయానికి 312/3తో నిలిచింది. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ రోహిత్ శర్మ 152 పరుగులతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu 9_1513953342


ఓపెనర్ శిఖర్ ధావన్ (38), కెప్టెన్ విరాట్ కోహ్లి (16) తక్కువ స్కోరుకే ఔటైనా.. మొక్కవోని దీక్షతో ఆడిన రోహిత్ శర్మ విండీస్ స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు బాదేశాడు. ముఖ్యంగా.. నర్స్ బౌలింగ్‌లో అయితే.. వరుసగా బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కి అంబటి రాయుడితో కలిసి అభేద్యంగా డబుల్ సెంచరీ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.