యాప్నగరం

ఛేదనలో విండీస్ 20/1, 20/2, 20/3..!

షై హోప్ లేని పరుగు కోసం ప్రయత్నించగా.. ఫీల్డర్ కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరే రీతిలో బంతిని నేరుగా వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. తర్వాత ఓవర్‌లో తడబాటు కారణంగా ఓపెనర్ పొవెల్ కూడా రనౌటయ్యాడు.

Samayam Telugu 29 Oct 2018, 6:56 pm
భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో 378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లను చేజార్చుకుంటోంది. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 20 వద్ద ఓపెనర్ హేమరాజ్ (14: 16 బంతుల్లో 1x4, 1x6) ఫీల్డర్ అంబటి రాయుడికి క్యాచ్ ఇచ్చి ఔటవగా.. ఆ తర్వాత వరుస ఓవర్లలో షై హోప్ (0), కీరన్ పొవెల్ (4) రనౌట్ రూపంలో వెనుదిరిగారు. దీంతో.. 4.2 ఓవర్లు ముగిసేసరికి 20/1తో నిలిచిన ఆ జట్టు 5.2 ఓవర్లలో 20/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
Samayam Telugu india vs west indies 4th odi run outs leave west indies reeling early in chase
ఛేదనలో విండీస్ 20/1, 20/2, 20/3..!


షై హోప్ లేని పరుగు కోసం ప్రయత్నించగా.. ఫీల్డర్ కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరే రీతిలో బంతిని నేరుగా వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. తర్వాత ఓవర్‌లో తడబాటు కారణంగా ఓపెనర్ పొవెల్ కూడా రనౌటయ్యాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు వదిలి పరుగు కోసం కొద్దిదూరం వచ్చిన పొవెల్ రనౌట్ ప్రమాదం గ్రహించి మళ్లీ వెనుదిరిగినా.. అప్పటికే బంతిని అందుకున్న కోహ్లి మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి గురి చూసి విసిరి రనౌట్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.