యాప్నగరం

ధోనీ సూపర్ ‘క్యాచ్’.. బుమ్రాకే తొలి వికెట్

ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖలీల్ అహ్మద్ ఆ క్యాచ్‌ని అందుకుంటాడని అంతా భావించారు. కానీ.. అతను బౌండరీ లైన్‌కి సమీపంలో ఉండటాన్ని గ్రహించిన ధోని.. చిరుతని తలపించే పరుగుతో వెళ్లి డైవ్ చేస్తూ క్యాచ్‌ని అందుకున్నాడు.

Samayam Telugu 27 Oct 2018, 2:40 pm
పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలి వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ (15: 20 బంతుల్లో 2x4, 1x6) వరుసగా 4, 6 బాది.. తర్వాత బంతిని కూడా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్‌ తాకిన బంతి ఫైన్‌లెగ్‌లో గాల్లోకి లేవగా.. మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వెళ్లిన వికెట్ కీపర్ ధోని.. డైవ్ చేస్తూ క్యాచ్‌ని అందుకున్నాడు.
Samayam Telugu india vs west indies live cricket score 3rd odi bumrah strikes again to get rid of powell
ధోనీ సూపర్ ‘క్యాచ్’.. బుమ్రాకే తొలి వికెట్


వాస్తవానికి ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖలీల్ అహ్మద్ ఆ క్యాచ్‌ని అందుకుంటాడని అంతా భావించారు. కానీ.. అతను బౌండరీ లైన్‌కి సమీపంలో ఉండటాన్ని గ్రహించిన ధోని.. చిరుతని తలపించే పరుగుతో వెళ్లి డైవ్ చేస్తూ క్యాచ్‌ని అందుకున్నాడు. 37ఏళ్ల ధోనీ.. పరుగెత్తిన తీరుకి మ్యాచ్ కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ కీరన్ పొవెల్ (21: 25 బంతుల్లో 2x4, 1x6) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే స్లిప్‌లో రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 8.1 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ 38/2తో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.