యాప్నగరం

ఉప్పల్ టెస్టు: టీ బ్రేక్‌కి వెస్టిండీస్ 197/6

ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రోస్టన్ ఛేజ్ మాత్రం భారీ షాట్లు బాదుతూ భారత్ బౌలర్లపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నాడు.

Samayam Telugu 12 Oct 2018, 2:32 pm
    హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఆరంభమైన ఈటెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు టీ విరామ సమయానికి 197/6తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ ఛేజ్ (50 బ్యాటింగ్: 81 బంతుల్లో 4x4, 1x6), కెప్టెన్ జేసన్ హోల్డర్ (10 బ్యాటింగ్: 20 బంతుల్లో 2x4) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఉమేశ్ యాదవ్ 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు.
    Samayam Telugu india vs west indies live score 2nd test day 1 west indies six wickets down
    ఉప్పల్ టెస్టు: టీ బ్రేక్‌కి వెస్టిండీస్ 197/6


    ఓపెనర్లు కీరన్ పొవెల్ (22: 30 బంతుల్లో 4x4), క్రైగ్ బ్రాత్‌వైట్ (14: 68 బంతుల్లో 2x4) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించగా.. అనంతరం వచ్చిన షై హోప్‌ (36: 68 బంతుల్లో 5x4) బౌండరీలతో వెస్టిండీస్ స్కోరు బోర్డుని నడిపించాడు. కానీ.. ప్రమాదకరంగా మారిన హోప్‌ని ఉమేశ్ యాదవ్ ఔట్ చేయడంతో లంచ్ విరామానికి ఆ జట్టు 86/3తో నిలిచింది. బ్రేక్ తర్వాత కొద్దిసేపటికే హెట్‌మెయర్ (12), ఆంబ్రిస్ (18)లను కుల్దీప్ యాదవ్ బోల్తాకొట్టించగా.. అనంతరం వచ్చిన షేన్ డార్విచ్ (30: 63 బంతుల్లో 4x4, 1x6)తో కలిసి రోస్టన్ ఛేజ్ దూకుడుగా ఆడాడు. దీంతో.. కాస్త కుదురుకున్నట్లు కనిపించిన వెస్టిండీస్.. జట్టు స్కోరు 182 వద్ద డార్విచ్ ఔటవడంతో మళ్లీ ఒత్తిడిలో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రోస్టన్ ఛేజ్ మాత్రం భారీ షాట్లు బాదుతూ భారత్ బౌలర్లపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నాడు.

    తరవాత కథనం

    Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
    తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.