యాప్నగరం

కివీస్‌తో తొలి వన్డే.. టాస్ నెగ్గిన కోహ్లి

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

TNN 22 Oct 2017, 1:18 pm
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత తరఫున శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ బరిలో దిగుతుండగా.. రహనే, మనీష్ పాండేలకు జట్టులో చోటు దక్కలేదు. ఆసీస్‌తో సిరీస్‌లో ఆకట్టులేకపోయిన మనీష్ పాండే స్థానంలో దినేశ్ బరిలో దిగుతున్నాడు. బోర్డ్ ఎలెవన్‌తో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన కివీస్ రెండో మ్యాచ్‌లో పుంజుకొని భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టేలర్, లాథమ్ శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోరు చేసింది.
Samayam Telugu india win the toss elect to bat first against new zealand
కివీస్‌తో తొలి వన్డే.. టాస్ నెగ్గిన కోహ్లి


భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇది 200వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. 2008లో అంతర్జాతీయ అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్పటి వరకు 199 వన్డేలు ఆడాడు. నేటి మ్యాచ్‌తో 200 వన్డేలు పూర్తిచేస్తాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు.

Captain @imVkohli wins the toss. Elects to bat first #INDvNZ #Virat200 pic.twitter.com/udy9SrPRrs — BCCI (@BCCI) October 22, 2017
న్యూజిలాండ్ జట్టు: గుప్టిల్, మన్రో, విలియమ్‌సన్, టేలర్, లాథమ్, నికోల్స్, డి గ్రాండ్‌హోమ్, శాంట్నర్, మిల్నే, సౌథీ, బౌల్ట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.