యాప్నగరం

IND vs PAK: భారత్ టార్గెట్ 134

తొలి ఓవర్‌లోనే అరుంధరి రెడ్డి ఓపెనర్ అయేషా (0)ని డకౌట్ చేయగా.. అనంతరం వచ్చిన సోహాలి (3) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటైంది. ఈ దశలో జవేరియా ఖాన్ (17) కాసేపు నిలకడగా ఆడినా.. జట్టు 30 వద్ద ఆమె కూడా రనౌటైంది.

Samayam Telugu 11 Nov 2018, 11:02 pm
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కి 134 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ నిర్దేశించింది. మరూఫ్ (53: 49 బంతుల్లో 4x4), నిదాదార్ (52: 35 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలు సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హేమలత, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అరుంధతి రెడ్డి ఒక వికెట్ తీసింది.
Samayam Telugu georgetown-georgetown-november-november-harmanpreet-tournament-celebrates_501b6af6-e586-11e8-b876-ee7dab6cad6d


మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత పాకిస్థాన్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఓవర్‌లోనే అరుంధరి రెడ్డి ఓపెనర్ అయేషా (0)ని డకౌట్ చేయగా.. అనంతరం వచ్చిన సోహాలి (3) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటైంది. ఈ దశలో జవేరియా ఖాన్ (17) కాసేపు నిలకడగా ఆడినా.. జట్టు 30 వద్ద ఆమె కూడా రనౌటైంది. ఈ దశలో నిలకడగా ఆడిన మరూఫ్, నిదా జోడీ.. నాలుగో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే.. జట్టు స్కోరు 124 వద్ద మరూఫ్ ఔటవడంతో మళ్లీ తడబడిన పాక్.. ఆఖరికి 133/7కే పరిమితమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.