యాప్నగరం

హార్దిక్ ప్లేస్ కాదు.. భారత్ గెలుపే టార్గెట్: దూబే

హార్దిక్ పాండ్యా స్థానంలో టీమ్‌లో చోటు దక్కించుకున్న శివమ్ దూబే.. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తేలిపోయాడు. దీంతో.. అతడిపై ఇటీవల వేటు వేసిన భారత సెలక్టర్లు మళ్లీ హార్దిక్‌కి చోటిచ్చారు.

Samayam Telugu 18 Mar 2020, 5:14 pm
భారత జట్టులో ఆల్‌రౌండర్ స్థానం కోసం హార్దిక్ పాండ్య, శివమ్ దూబే మధ్య పోటీ నడుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో గాయపడిన హార్దిక్ పాండ్య.. వెన్ను గాయానికి సర్జరీ చేయించుకుని టీమ్‌కి దూరమయ్యాడు. దీంతో.. అతని స్థానంలో అవకాశం దక్కించుకున్న శివమ్ దూబే.. వరుస మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. నిలకడగా రాణించలేకపోయాడు. ఒక్క వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది లేదు. దీంతో.. ఇటీవల హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించగా.. దూబేపై వేటు వేసిన సెలక్టర్లు హార్దిక్‌కి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.
Samayam Telugu Shivam Dube Six


Read More: undefined

టీమిండియాలో స్థానంపై తాజాగా శివమ్ దూబే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘అందరూ నన్ను హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడిగా చూస్తున్నారు. కానీ.. నేను టీమ్‌లో హార్దిక్ పాండ్యాని రీప్లేస్ చేయడానికి ఉండటం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శనతో భారత్ జట్టుని గెలిపించడానికే ఉన్నాను. అయితే.. హార్దిక్ పాండ్య టీమ్‌లో సీనియర్, కీలక ఆటగాడు. ఒకవేళ అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే..? టీమ్‌లో అతని స్థానానికి ఢోకా ఉండదు’ అని శివమ్ దూబే వెల్లడించాడు.

Read More: ధోనీలా క్రమశిక్షణ తప్పొద్దు.. నన్ను ఫాలో అవ్వండి: హర్భజన్ సెటైర్
ముంబయి వేదికగా ఇటీవల జరిగిన డీవై పాటిల్ టీ20 కప్‌లో వరుసగా రెండు మెరుపు సెంచరీలు బాదిన హార్దిక్ పాండ్యా.. మళ్లీ ఫామ్ నిరూపించుకున్నాడు. దీంతో.. ఈ నెలలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ కోసం హార్దిక్‌ని ఎంపిక చేశారు. కానీ.. కరోనా వైరస్ కారణంగా.. సిరీస్‌ని బీసీసీఐ అర్ధాంతరంగా రద్దు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.