యాప్నగరం

ఆ టోర్నీ నెగ్గడం వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్ కంటే ఎక్క‌ువే!

న్యూజిలాండ్‌తో ఈనెల 21 నుంచి భార‌త జ‌ట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. వెల్లింగ్ట‌న్‌లో తొలి టెస్టు ప్రారంభ‌మ‌వుతుంది. ప్రస్తుతం టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో టాప్ ప్లేస్‌లో భార‌త్ కొనసాగుతోంది.

Samayam Telugu 15 Feb 2020, 10:19 pm
అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంపై భార‌త టెస్టు బ్యాట్స్‌మ‌న్ చ‌టేశ్వ‌ర్ పుజారా ఆనందం వ్య‌క్తం చేశాడు. టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను కైవ‌సం చేసుకోవ‌డం.. వ‌న్డే, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించిన‌దానికంటే కూడా ఎక్కువే అని వ్యాఖ్యానించాడు. ఐసీసీ టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోన్న భార‌త్ ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉంది. ఈనెల 21 నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ జ‌రుగ‌నుంది.
Samayam Telugu Indore: Indian batsman C Pujara plays a shot during the first day of the first T...
Pujara


Read Also: IND vs NZ Test Series: భారత్‌కు శుభవార్త.. ఆ ప్లేయర్ జట్టులోకి..
ఇక టెస్టు చాంపియ‌న్‌షిప్ కైవ‌సం చేసుకోవ‌డం ఏ జ‌ట్టుకైనా గొప్ప అచీవ్‌మెంట్ అని పుజారా పేర్కొన్నాడు. పాత‌త‌రంతోపాటు ప్ర‌స్తుత ప్లేయ‌ర్లను ఎవ‌రిని అడిగిన టెస్టుల గొప్ప‌ద‌నం గురించి చెబుతార‌ని వ్యాఖ్యానించాడు. టెస్టుల్లో రాణించ‌డం అతి క‌ష్ట‌మైన విష‌య‌మని, ఐసీసీ తాజాగా తీసుకున్న చ‌ర్య‌ల‌తో లాంగ్ ఫార్మాట్ వృద్ధికి మ‌రింత‌గా దోహదం చేయ‌గ‌ల‌ద‌ని వ్యాఖ్యానించాడు.

Read Also: ఆ భార‌త‌ క్రికెట‌ర్‌ను అస్స‌లు డ్రాప్ చేయొద్దు
మ‌రోవైపు టెస్టు చాంపియ‌న్‌షిప్ వ‌ల్ల జ‌ట్ట‌లో పోటీత‌త్వం పెరుగుతంద‌ని పుజారా అభిప్రాయ‌ప‌డుతున్నాడు. ఈ విధానం ద్వారా ఫ‌లితాలు వస్తాయ‌ని, జ‌ట్లు పాయింట్ల కోసం మ‌రింత మెరుగైన ఆట‌తీరును క‌న‌బ‌రుస్తాయ‌ని పేర్కొన్నాడు. మ‌రోవైపు సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ ఆధిప‌త్యం క‌న‌బ‌ర్చింద‌ని, గ‌తంలో విదేశాల్లో కూడా రాణించిన రికార్డు ప్ర‌స్తుత టీమిండియాకు ఉంద‌ని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో అదే పెద్ద ప్ల‌స్ పాయింట్ అని తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.