యాప్నగరం

IND vs AUS: స్టీవ్‌స్మిత్ వీక్‌నెస్‌ భారత బౌలర్లకి తెలియదా..?: బ్రాడ్ హగ్

వన్డే సిరీస్‌లో స్టీవ్‌స్మిత్‌ని కట్టడి చేయడంలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. స్మిత్ బలహీనత తెలిసినా.. అతడ్ని ఇబ్బంది పెట్టడంలో టీమిండియా బౌలర్లు విఫలమవడంపై విమర్శలు వస్తున్నాయి.

Samayam Telugu 30 Nov 2020, 8:06 pm
భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ బ్యాక్ టు బ్యాక్ శతకాలతో చెలరేగాడు. తొలి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్టీవ్‌స్మిత్.. రెండో వన్డేలోనూ 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు. మొత్తంగా.. వన్డేల్లో స్మిత్‌ 11 సెంచరీలు బాదగా.. ఐదు శతకాలు భారత్‌పైనే అతను సాధించడం గమనార్హం.
Samayam Telugu ​Steve Smith
Steve Smith celebrates after reaching his century in the 2nd ODI against India in Sydney. (AFP Photo)


రెండు వన్డేల్లోనూ స్టీవ్‌స్మిత్ కట్టడికి భారత్ వద్ద సరైన గేమ్ ప్లాన్ లేదని అతను సాధించిన స్కోర్లని చూస్తే అర్థమవుతోంది. వాస్తవానికి షార్ట్ పిచ్ బంతుల్ని ఆడలేకపోవడం స్టీవ్‌స్మిత్ బలహీనత. గత ఏడాది ప్రత్యర్థి బౌలర్లు ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులతో అతడ్ని బోల్తా కొట్టించారు. కానీ.. రెండు వన్డేల్లోనూ ఆ బంతుల్ని సంధించడంలో భారత ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ విఫలమయ్యారు. దాంతో.. రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు బాదిన స్టీవ్‌స్మిత్.. ఆ టీమ్‌కి సురక్షితమైన స్కోర్లు అందించాడు.

స్టీవ్‌స్మిత్‌ ముందు భారత బౌలర్లు తేలిపోవడంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ మాట్లాడుతూ ‘‘స్టీవ్‌స్మిత్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు.. భారత బౌలర్లు ఎందుకు షార్ట్ పిచ్ బంతుల్ని సంధించలేకపోయారు. మ్యాచ్‌ల్లో వాళ్లు గుడ్ లెంగ్త్, లిటిల్ ఫుల్లర్ బంతుల్ని విసిరారు. అదేం వ్యూహమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే.. షార్ట్ పిచ్ బాల్ ఆడలేకపోవడం స్టీవ్‌స్మిత్ బలహీనత. మరి ఎందుకు ఆ బంతుల్ని విసిరేందుకు భారత బౌలర్లు ప్రయత్నించలేదు’’ అని బ్రాడ్ హగ్ ప్రశ్నించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం మూడో వన్డే జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.