యాప్నగరం

వరల్డ్ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. రోహిత్‌కు షాకేనా?

లంకతో ఆదివారం ప్రారంభమయ్యే తొలి టీ20లో వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు భారత కెప్టెన్ కోహ్లీ సిద్ధమయ్యాడు. మరో రన్ సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా.. రోహిత్‌ను వెనక్కినెట్టి నం.1గా కోహ్లీ అవతరిస్తాడు.

Samayam Telugu 4 Jan 2020, 6:56 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్ రికార్డుకు ఒక్క రన్ దూరంలో నిలిచాడు. ఈ ఫార్మాట్‌‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు తనకు ఒక్క రన్ అవసరం కానుంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ప్రస్తుతం ఈ జాబితో నం.1 ర్యాంకులో ఉమ్మడిగా ఉన్నాడు. వీరిద్దరి ఖాతాలో 2,633 పరుగులు ఉన్నాయి.
Samayam Telugu virat kohli


Read Also : టెస్టుల్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసిన ఏకైక పేసర్ ఇర్ఫాన్
అయితే ఆదివారం నుంచి అసోం గువాహటిలో ప్రారంభమయ్యే తొలి టీ20లో కోహ్లీ ఈ రికార్డును దాటే అవకాశముంది. ఎందుకంటే లంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌కు విశ్రాంతినివ్వడంతో కోహ్లీ ఒక్కడే బరిలోకి దిగుతున్నాడు. మరో రన్ సాధించడం చాలా ఈజీ కాబట్టి.. గువాహటిలోనే కోహ్లీ ఈ రికార్డు‌ను అందుకునే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Also : కూతురు జీవాతో ధోనీ.. మంచులో ఆటలు (వీడియో)
ఇక తీరిక లేని షెడ్యూల్ నుంచి రోహిత్ శర్మకు కాస్త విరామాన్ని సెలెక్టర్లు ఇచ్చారు. ఓవరాల్‌గా 104 టీ20లు ఆడిన హిట్‌మ్యాన్ - సగటుతో 2,633 పరుగులు సాధించాడు. మరోవైపు కేవలం 75 మ్యాచ్‌ల్లోనే 2,633 పరుగులు సాధించిన కోహ్లీ యావరేజ్ 52.66 కావడం విశేషం. ఇందులో 24 అర్ధసెంచరీలు ఉండటం విశేషం.

Read Also : Virat Kohli : ఆ మార్పులతో రేపటి రోజుల్లో టెస్టు క్రికెటే ఉండదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.