యాప్నగరం

కోహ్లీనే బెస్ట్ వన్డే బ్యాట్స్‌మెన్.. ఒప్పుకున్న స్టీవ్‌స్మిత్

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ (765), జో రూట్ (759) వరుసగా 8, 9 స్థానాల్లో ఉన్నారు. ఇక స్టీవ్‌స్మిత్ (673) ఎక్కడో 21వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

Samayam Telugu 10 Sep 2020, 8:45 pm
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం బెస్ట్ వన్డే బ్యాట్స్‌మెన్ ఎవరు..? సాధారణంగా ఈ ప్రశ్న‌ క్రికెటర్లని అడిగితే విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్, జోరూట్, కేన్ విలియమ్సన్ రూపంలో ఓ నలుగురు పేర్లని చెప్తుంటారు. కానీ.. ఈ నలుగురిలో ఒకరిని అదే ప్రశ్న అడిగితే.. సమాధానం ఊహించగలరా..? ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ని ఒక అభిమాని సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న అడిగితే.. అతను తడముకోకుండా విరాట్ కోహ్లీనే బెస్ట్ వన్డే బ్యాట్స్‌మెన్ అని క్లారిటీ ఇచ్చేశాడు.
Samayam Telugu Virat Kohli, Steve Smith
Virat Kohli and Steve Smith


యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ని కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ నడిపించబోతున్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌ 2008లో టోర్నీ విజేతగా నిలిచిన రాజస్థాన్ టీమ్.. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శనని మళ్లీ ఈ 11 ఏళ్లలో కనబర్చలేకపోయింది. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌లో పట్టుదలతో ఆ టీమ్ బరిలోకి దగబోతోంది.

Read More: ఐపీఎల్ 2020 ముంగిట RCB vs RR మాటల యుద్ధం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నడిపించబోతుండగా.. ఇప్పటి వరకూ ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. 2008 నుంచి మూడు సార్లు ఫైనల్‌కి చేరిన ఆర్సీబీ టీమ్.. గత మూడు సీజన్లుగా కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోతున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.