యాప్నగరం

భారత్, వెస్టిండీస్ మధ్య రేపే టెస్టు మ్యాచ్

పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌ కారణంగా.. తొలి టెస్టులో భారత్‌కి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన వెస్టిండీస్ జట్టు కనీసం రెండో టెస్టులోనైనా పుంజుకోవాలని ఆశిస్తోంది.

Samayam Telugu 11 Oct 2018, 6:34 pm
భారత్, వెస్టిండీస్‌ మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో అలవోకగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో.. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న టీమిండియా.. రెండో టెస్టులోనూ గెలిచి కరీబియన్లని క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
Samayam Telugu Rajkot: Indian cricket team practice ahead of their first match in the India-Wes...
Indian cricket team practice ahead of their first match in the India-West Indies test series, in Rajkot.Photo)


పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌ కారణంగా.. తొలి టెస్టులో భారత్‌కి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన వెస్టిండీస్ జట్టు కనీసం రెండో టెస్టులోనైనా పుంజుకోవాలని ఆశిస్తోంది. మరోవైపు జట్టు ప్రదర్శనపై ఇంటా బయట పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన నేపథ్యంలో.. ఆ జట్టు నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని విరాట్ కోహ్లీనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఈ టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో నిన్న, ఈరోజు చెమటోడ్చారు. ఈ టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో నిన్న, ఈరోజు చెమటోడ్చారు.


హైదరాబాద్‌ టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్

రెండో టెస్టు కోసం నెట్స్‌లో చెమటోడ్చిన టీమిండియా .. ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.