యాప్నగరం

జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు

ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందర భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఆదివారం ముంబైలో జరిగే ప్రదానోత్సవంలో తను ఈ అవార్డు అందుకోనున్నాడు.

Samayam Telugu 12 Jan 2020, 1:02 pm
అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సరైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. జట్టులో అడుగుపెట్టిన కొద్దికాలానికే ప్రధాన పేసర్‌గా ఎదిగిన బుమ్రా.. ప్రస్తుతం వరల్డ్ నం.1 వన్డే బౌలర్‌గా నిలిచాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా తనను పరిణగిస్తున్నారు.
Samayam Telugu indian cricketer jasprit bumrah will receive polly umrigar award
జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు


Read Also : సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం
మరోవైపు కొన్ని అరుదైన రికార్డులు బుమ్రా పేరిట ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక వికెట్లు (53) తీసిన భారత బౌలర్‌గా తను నిలిచాడు. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆసియా బౌలర్‌గా ఘనత వహించాడు. ఆదివారం జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బుమ్రాకు ఈ అవార్డు అందుకోనున్నాడు.

Read Also : ధోనీనిఆడకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా..? గావస్కర్ అనుమానం
మహిళల విభాగంలో పూనమ్ యాదవ్‌కు ఉత్తమ క్రికెటర్‌గా ఎంపికైంది. గత కొంతకాలంలో అంతర్జాతీయ క్రికెట్లో లెగ్ స్పిన్నర్‌గా తను సత్తాచాటుతోంది. మరోవైపు లెజెండరీ క్రికెటర్లు కృష్ణామాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలకు కల్నల్ సీకే నాయుడు అవార్డుకు ఎంపికయ్యారు. మైదానంలోని ప్రదర్శనలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారని బోర్డు చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. మరోవైపు అవార్డుల వేదికపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రసంగం చేయనున్నాడు.

Read Also : న్యూజిలాండ్‌ టూర్‌ సెలెక్షన్.. హార్దిక్‌పైనే అందరిదృష్టి ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.